ఈరోజు బంగారం ధర ఎలా వుంది.. కొనాలా లేక వద్దా..!!

Updated on 08-Sep-2022
HIGHLIGHTS

నిన్న మార్కెట్లో భారీగా పతన మైన బంగారం సూచీలు ఈరోజు పుంజుకున్నాయి

ఈరోజు మార్కెట్లో బంగారం ధర పెరుగుదలను నమోదు చేసింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ మళ్ళి కొంచెం పెరిగింది

నిన్న మార్కెట్లో భారీగా పతన మైన బంగారం సూచీలు ఈరోజు పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే 500 రూపాయల వరకూ పడిపోయిన 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ ఈరోజు కొంచెం పైకి లేచింది. ఈరోజు మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 250 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది. మొత్తంగా సెప్టెంబర్ 3 నుండి గోల్డ్ రేట్ పెరుగుతూ రాగా, నిన్న మాత్రం ఒక్కసారిగా పడిపోయింది. అయితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ మళ్ళి కొంచెం పెరిగింది. మరి ఈరోజు దేశవాప్తంగా బంగారం ధర ఎలా కొనసాగుతుందో చూద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,400 రూపాయలుగా ఉండగా, ఈరోజు 250 రూపాయలు పెరిగి 46,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,890 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,660 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,650 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,890 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :