Gold Price Today: ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న గోల్డ్ మార్కెట్.!

Gold Price Today: ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్న గోల్డ్ మార్కెట్.!
HIGHLIGHTS

గోల్డ్ ఇన్వెస్టర్లకు కాసులు వర్షం కురిపిస్తోంది

ఆల్ టైమ్ గరిష్ట ధరను రికార్డ్ చేసిన గోల్డ్ మార్కెట్

ప్రస్తుతం 67 వేల రూపాయల మార్కెట్ ను దాటి పైకి సాగుతోంది

Gold Price Today: రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధర, గోల్డ్ ఇన్వెస్టర్లకు కాసులు వర్షం కురిపిస్తోంది. గత వారం మార్చి 21వ తేదీ ఆల్ టైమ్ గరిష్ట ధరను రికార్డ్ చేసిన గోల్డ్ మార్కెట్ తరువాత పడిపోయింది. అయితే, ఈ వారం ప్రారంభం నుండి మళ్ళీ లాభాల బాటలో నడిచిన గోల్డ్ మార్కెట్ తిరిగి మళ్ళీ ఆల్ టైమ్ గరిష్ట ధర వైపుగా సాగుతోంది. ఈరోజు కూడా మర్కెట్ లో లాభాలను చూసిన గోల్డ్, ప్రస్తుతం 67 వేల రూపాయల మార్కెట్ ను దాటి పైకి సాగుతోంది.

గడిచిన 10 రోజుల బంగారం ధర అప్డేట్

గడిచిన 10 రోజుల బంగారం ధర అప్డేట్ విషయానికి వస్తే, ఈ టైం పిరియడ్ లో గోల్డ్ మార్కెట్ తులానికి దాదాపుగా రూ. 1,000 రూపాయల పెరుగు ధాలను చూసింది. 19 March 2024 న రూ. 66,330 రూపాయల వద్ద కొనసాగిన 10 గ్రాముల గోల్డ్ రేట్, మార్చి 21న ఒక్కరోజే రూ. 1,090 పెరుగుదలను చూసి, రూ. రూ. 67,420 ఆల్ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసింది.

Gold Price Live Update
Gold Price Live Update

అయితే, తరువాతి రోజు నుండి మెల్లగా క్రిందకు దిగుతూ మార్చి 26న రూ. 66,710 రూపాయల కనిష్ట రేటును నమోదు చేసింది. అయితే, మార్చి 27 మరియు ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ లాభాలను చూడటంతో, రోజు రూ. 66,310 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపించింది.

కానీ, ఇప్పుడు కొనసాగుతున్న గోల్డ్ రేట్, పసిడి ప్రియులకు ముచ్చెమటలు పట్టిస్తోంది. రానున్నది పెళ్లిళ్ల సీజన్ కాబట్టి, ఆ నాటికి బంగారం ధర ఎంత ఉంటుందో అని కూడా వాపోతున్నారు.

Also Read: 20 వేలకే OnePlus Nord CE 3 5G అందుకునే అద్భుతమైన అవకాశం.!

Gold Price Today

24 క్యారెట్ గోల్డ్ రేట్

ఈరోజు ప్రధాన మార్కెట్ లో నడుస్తున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం ఈరోజు 10గ్రా|| 24 క్యారెట్ గోల్డ్ రూ. 67,310 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర రూ. 380 రూపాయలు పెరిగింది.

22 క్యారెట్ గోల్డ్ రేట్

ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రూ. 61,700 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 350 రూపాయల పెరుగుదలను చూసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo