ఈరోజు పైకి చూసిన గోల్డ్ సూచీలు..అయినా 7 నెలల కనిష్టంలోనే రేటు..!

Updated on 22-Jul-2022
HIGHLIGHTS

ప్రస్తుత గోల్డ్ మార్కెట్ 7 నెలల కనిష్ఠంలోనే కొనసాగుతోంది

మార్కెట్లో గోల్డ్ కొనులుగోలుదారుల సందడి మార్కెట్లో కనిపించడం లేదు

ఇన్వెస్టర్ల కోసం మాత్రం గోల్డ్ ఆశాజనకంగా కనిపిస్తోంది

నిన్నటి వరకూ భారీగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ సూచీలు, ఈరోజు కొంచెం పైకి చూశాయి. అయినా కూడా ప్రస్తుత గోల్డ్ మార్కెట్ 7 నెలల కనిష్ఠంలోనే కొనసాగుతోంది. బంగారం ధర తగ్గినా కూడా మార్కెట్లో గోల్డ్ కొనులుగోలుదారుల సందడి మార్కెట్లో కనిపించడం లేదు. కానీ, ఇన్వెస్టర్ల కోసం మాత్రం గోల్డ్ ఆశాజనకంగా కనిపిస్తోంది. నిన్నటితో పోలిస్తే బంగారం ధర తులానికి 400 రూపాయలు  పెరిగింది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా వున్నదో చూద్దామా.         

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు 400 రూపాయలు పెరిగి 46,400 రూపాయల వద్ద నిలిచింది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 440 రూపాయలు పెరిగి రూ.50,580 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,580 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,580 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,580 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,660 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,900 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :