వారం తరువాత ఈరోజు తగ్గిన బంగారం.. తులం రేటు ఎంతంటే.!

వారం తరువాత ఈరోజు తగ్గిన బంగారం.. తులం రేటు ఎంతంటే.!
HIGHLIGHTS

గత వారం నుండి కదలకుండా ఒకేదగ్గర నిలకడగా ఉన్న బంగారం ధర

బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగొచ్చింది

ఈరోజు మార్కెట్ ఓపన్ అవుతూనే బంగారం ధర పడిపోయింది

గత వారం నుండి కదలకుండా ఒకేదగ్గర నిలకడగా ఉన్న బంగారం ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగొచ్చింది. గత వారం నుండి నిన్నటి వరకూ కూడా బంగారం ధరలో ఎటువంటి మార్పు కనపడక పోవడం గమనార్హం. అయితే, ఈరోజు మార్కెట్ ఓపన్ అవుతూనే బంగారం ధర తులానికి 300 రూపాయల వరకూ తరుగుదలను నమోదు చేసింది. మరి మర్కెట్లో ఈరోజు గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతుందో పరిశీలిద్దామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,730 రూపాయలుగా ఉండగా ఈరోజు 330 రూపాయల వరకూ క్రిందకు దిగి, 46,400 రూపాయల వద్ద  కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,620 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,410 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,640 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,620 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,010 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,280 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo