Gold Price Stable: ఏప్రిల్ నెల మొత్తం భారీగా పెరుగుతూ వచ్చి రికార్డు స్థాయి రేటును సైతం నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, నెల చివరలో స్థిరంగా నిలబడింది. ఏప్రిల్ 27 వ తారీఖు వరకు హైయెస్ట్ రేటులో కొనసాగిన బంగారం ధర 28వ తేదీ నుంచి స్థిరముగా కొనసాగింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ మార్కెట్ 72 వేల మార్కు వద్ద ఈ నెల క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఏప్రిల్ నెల మొత్తం కూడా గోల్డ్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అద్భుతమైన నెల గా నిలిచింది. అయితే పసిడి ప్రియులకు మాత్రం నిద్రలేని రాత్రులను చూపించింది. ఎందుకంటే, ఏప్రిల్ 1వ తేదీ రూ. 68,450 రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ ఒక సమయంలో రూ. 74,340 రూపాయల పీక్ రేటును చూసింది. అంటే, గోల్డ్ రేట్ దాదాపు 5వేల రూపాయల వరకు భారీ పెరుగుదలను చూసింది.
అయితే, గోల్డ్ మార్కెట్ నెల చివరి నాటికి 2 వేళా రూపాయల వరకు దిగజారిన గోల్డ్ రేట్ 72 వేల రూపాయల వద్దకు చేరుకుంది. ఏప్రిల్ నెల చివరి రోజు గోల్డ్ రేట్ రూ. 72,600 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది.
Also Read: Amazon Summer Sale: అమెజాన్ సేల్ భారీ ఆఫర్లతో రేపటి నుంచి స్టార్ట్ అవుతోంది.!
ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగిన గోల్డ్ రేటు విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 72,600 రూపాయల వద్ద మార్కెట్ ముగిసింది. ఈ వారం ప్రారంభం నుండి ఇదే రేటు వద్ద గోల్ మార్కెట్ కొనసాగుతోంది.
ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ రేటు రూ. 66,550 రూపాయల వద్ద ముగిసింది.