Gold Price Stable: మార్కెట్ లో స్థిరంగా బంగారం.. Future Advice ఏమిటి.!

Gold Price Stable: మార్కెట్ లో స్థిరంగా బంగారం.. Future Advice ఏమిటి.!
HIGHLIGHTS

గత కొన్ని రోజులుగా మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది

60 వేల మార్క్ ను చేరుకున్న Gold Price అక్కడే Stable గా కొనసాగుతోంది

Gold Future Advice ఏమిటి అనేది ప్రస్తుతం మర్కెట్ లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న

Gold Price Stable: గత కొన్ని రోజులుగా మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. గత నెలతో పోలిస్తే, సెప్టెంబర్ నెలలో గోల్డ్ రేట్ దాదాపుగా నిశ్చలంగా మరియు స్థిరంగా కొనసాగుతుందని తడుముకోకుండా చెప్పవచ్చు. ఈ నెల ప్రారంభంలో 60 వేల మార్క్ ను చేరుకున్న Gold Price అక్కడే Stable గా కొనసాగుతోంది. అయితే, గోల్డ్ కొనాలా లేక అమ్మలా అనే అంశం పైన  Future Advice ఏమిటి అనేది ప్రస్తుతం మర్కెట్ లో వినిపిస్తున్న ప్రధాన ప్రశ్న. అందుకే, ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ తో పాటుగా గత మూడు నెలల గోల్డ్ రేట్ లను కూడా పరిశీలిద్దాం. 

What is Todays Gold Price?

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా ఉందని పరిశీలిస్తే, ఈరోజు రూ. 59,830 రూపాయల వద్ద స్టార్ట్ అయిన 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర, ఈరోజు ఎటువంటి లాభ నష్టాలను చూడకుండా అదే రేటు వద్ద క్లోజింగ్ నమోదు చేసింది. 22K క్యారెట్ గోల్డ్ రేట్ కూడా ఈరోజు ఓపెనింగ్ రేటు (రూ. 54,840) నే క్లోజింగ్ రేటుగా రికార్డ్ చేసింది.

is Gold price stable today?

అవును ఈరోజు బంగారం ధర పూర్తిగా స్థిరంగా కొనసాగింది మరియు ఎటువంటి లాభ నష్టాలను నమోదు చెయ్యలేదు.          

Is gold a good investment in 2023?

ప్రపంచ వ్యాప్తంగా గోల్ అనేది ఇన్వెస్ట్మెంట్ కు సేఫెస్ట్ మెటల్ గా పరిగణించబడుతుంది. గోల్డ్ రేట్ లో స్వల్పంగా మార్పులు కనిపిస్తున్నా విదేశీ ద్రవ్యం మరియు మారక విలువతో  గోల్డ్ రేట్ లో మార్పులు సంభవించవచ్చు. అయినప్పటికీ, ప్రస్తుతమార్కెట్ లో స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే లాభాలను చూడకపోయినా నష్టాలను చూసే అవకాశం ఉండకపోవచ్చు అనేది నిపుణుల అంచనాగా చెబుతున్నారు.

What is the price of gold for the past month?

ఇక గత మూడు నెలలుగా కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ వివరాల్లోకి వెళితే, గోల్డ్ రేట్ జూన్ లో రూ. 60,450 వద్ద కొనసాగిన గోల్డ్ రేట్ ప్రస్తుతం రూ. 59,830 రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే, జూన్ నెల చివరిలో గోల్డ్ రేట్ అత్యంత కనిష్ట రేట్ ను కూడా నమోదు చేసింది. జూన్ 29 న రూ.58,750 కనిష్ఠాన్ని చూసిన గోల్డ్ మార్కెట్ మళ్లి పుంజుకొని జూలై 20 వ తేదికి రూ. 60,750 రూపాయల గరిష్టాన్ని తాకింది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo