Gold Rate: స్వల్పంగా క్రిందకు దిగిన బంగారం ధర.!

Gold Rate: స్వల్పంగా క్రిందకు దిగిన బంగారం ధర.!
HIGHLIGHTS

ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగిన బంగారం ధర

తులానికి 450 రూపాయలకు పైగా గోల్డ్ మార్కెట్ క్రిందకు దిగింది

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉన్నదో తెలుసుకోండి

ఈ వారం బంగారం ధర కొంత స్థిరత్వాన్ని కనబరచినా ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది. సోమవారం నుండి ఈరోజు వరకూ మొత్తంగా తులానికి 450 రూపాయలకు పైగా గోల్డ్ మార్కెట్ క్రిందకు దిగింది. సోమవారం మార్కెట్ లో తులం బంగారం ధర 56,830 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర ఈరోజు 56,510 రూపాయల వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉన్నదో తెలుసుకుందామా. 

Gold Rate:

నిన్న ప్రధాన మార్కెట్ లో రూ.52,000 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు క్రిందకు దిగి రూ.51,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,730 నుండి రూ.56,510 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,510 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,510 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,610 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,220 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.  

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo