Gold Price Live Update: మళ్ళీ పెరుగుతున్న బంగారం ధర.!

Updated on 08-Dec-2023
HIGHLIGHTS

గోల్డ్ మార్కెట్ లో హైఎస్ట్ రేటును చూసిన గోల్డ్ మార్కెట్

ఈ వారం మొత్తం గోల్ మార్కెట్ నాటకీయ పరిణామాలను చూసింది

గోల్డ్ రేట్ మళ్ళీ తిరిగి 63 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది

Gold Price Live Update: ఈ వారం ప్రారంభంలో క్రిందకు దిగిన బంగారం ధర, నిన్న మరియు ఈరోజు మెల్లగా పెరుగుతూ వచ్చింది. ఈ నెల గోల్డ్ మార్కెట్ లో హైఎస్ట్ రేటును చూసిన గోల్డ్ మార్కెట్ మళ్ళీ తిరిగి నష్టాలను చూసి 62 వేల మార్క్ ను చేరుకుంది. అయితే, వరుసగా రెండు రోజులు గోల్ రేట్ స్వల్పంగా పెరుగుదలను చూడటంతో మళ్ళీ తిరిగి 63 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది.

Gold Price Live Update

పూర్తిగా ఈ వారం మొత్తం గోల్ మార్కెట్ నాటకీయ పరిణామాలను చూసిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే, గత వారం చివరికి వరకూ వరసగా బంగారం పెరగడంతో శనివారినికి రూ. 63,760 రూపాయల వద్ద ఒక తులం గోల్డ్ రేట్ క్లోజింగ్ ను చూసింది. దూకుడు మీదున్న బంగారం ధర వారం ప్రారంభం రోజైన ఈ సోమవారం (డిసెంబర్ 4) ఈరోజు రూ. 64,200 రూపాయల గరిష్ట ధరను ఒక తులం గోల్డ్ రేట్ నమోదు చేసింది.

గోల్డ్ రేట్ అప్డేట్

అయితే, మంగళవారం (డిసెంబర్ 5) రోజున రూ. 1,090 రూపాయల క్రిందకు దిగి రూ. 63,110 రూపాయల వద్ద నిలిచింది. అంతేకాదు, తరువాతి ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ నష్టాలను చూసి 62 వేల రూపాయల మార్క్ చేరుకుంది. అయితే, ఇప్పుడు మొల్ల మెల్లగా పెరిగిన గోల్డ్ రేట్ ఈరోజు 63 వేల మార్క్ ను చేరుకుంది.

Also Read : boAt స్మార్ట్ వాచ్: eSIM సపోర్ట్ తో Lunar Pro LTE స్మార్ట్ వాచ్ తెచ్చింది.!

Today 24 Carat గోల్డ్ రేట్ అప్డేట్

ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 Carat గోల్డ్ రేట్ అప్డేట్ వివరాల్లోకి వెళితే , ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ స్వచమైన బంగారం ధర రూ. 62,950 రూపాయల క్లోజింగ్ సెట్ చేసింది. గడిచిన రెండు రోజులో 10 గ్రాముల 2 క్యారెట్ బంగారం ధర రూ. 280 రూపాయలు పెరిగింది.

Today 22 Carat గోల్డ్ రేట్ అప్డేట్

ఇక ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 57,700 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. గడిచిన రెండు రోజుల్లో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 250 రూపాయలు పెరిగింది.

గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :