Gold Price: మళ్ళీ రికార్డ్ మార్కు వైపుగా బంగారం ధర.!
ఈవారం రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర
రెండు రోజుల్లో తిరిగి పుంజుకున్న మార్కెట్
ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ ఏమిటో తెలుసుకోండి
Gold: ఈవారం రికార్డు స్థాయికి చేరుకున్న బంగారం ధర, తరువాత మళ్ళీ క్రిందకు దిగింది. అయితే, రెండు రోజుల్లో తిరిగి పుంజుకున్న మార్కెట్ మరొక్కసారి 60 వేల మార్క్ ను టచ్ చేసింది. ఇటీవల క్రిందకు దిగిన బంగారం ధర మళ్ళీ రికార్డు స్థాయి ధర వైపుగా ఎగబాకుతోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ ఏమిటో తెలుసుకోండి.
Gold:
ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.54,800 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.200 రూపాయలు పెరిగి రూ.55,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.59,780 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,000 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈఈరోజు బంగారం ధర రూ.220 రూపాయలు పెరుగుదలను నమోదు చేసినట్లు మనం చూడవచ్చు.
ఈరోజు బంగారం ధర
తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,000 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,150 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,650 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.