Gold Price: ఎన్నడూ లేని విధంగా గోల్డ్ రేట్ చాలా స్థిరంగా కొనసాగుతోంది. గత వారం చివరి నుండి బంగారం ధర ఒకే రేటు వద్ద అంటి పెట్టుకొని నడుస్తోంది. అయితే, వాస్తవానికి గోల్డ్ మార్కెట్ గడిచిన 20 రోజుల్లో కూడా బంగారం ధర ఇంచు మించుగా ఒకే వద్ద తిరుగుతున్నట్లు మనం గమనించవచ్చు. ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ మరియు 20 రోజుల మార్కెట్ అప్డేట్ వివరాలను తెలుసుకుందాం.
గోల్డ్ రేట్ ఈరోజు కూడా రూ. 63,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగింది. 20 రోజుల క్రితం జనవరి 4న రూ. 63,380 రూపాయల ధర వద్ద నుండి కొంచెం అటు ఇటుగా 63 వేల మార్క్ వద్దనే కొనసాగింది. అయితే, జనవరి 18వ తేదీ రూ. 62,620 రూపాయల కనిష్ట ధరను చేరుకుంది. అయితే, మళ్ళీ తిరిగి పుంజుకున్న గోల్డ్ మార్కెట్ 63 వేల రూపాయల మార్క్ ను చేరుకొని స్థిరంగా కొనసాగుతోంది.
Also Read : ViewSonic Projectors: Xbox సపోర్ట్ తో వచ్చిన మొదటి ప్రొజెక్టర్..ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే.!
ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 63,000 రూపాయల రేటు వద్ద స్థిరంగా కొనసాగింది. గత వారం రోజులుగా గోల్డ్ రేట్ ఇదే రేటు వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
అలాగే, ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 63,000 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగింది. గత వారం రోజులుగా గోల్డ్ రేట్ ఇదే రేటు వద్ద స్థిరంగా కొనసాగింది.
గడిచిన 20 రోజులుగా 63 వేల రూపాయలనే అంటిపెట్టుకొని తిరుగుతున్న గోల్డ్ మార్కెట్ 2024 లో ఎటువైపు సాగుతుందో అని పసిడి ప్రియులు ఆలోచిస్తున్నారు. అందుకే, నిపుణుల సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నారు. గోల్డ్ మార్కెట్ మళ్ళీ పెరుగుదలను చూసే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఎక్స్ పెక్టడ్ ధర ధర వివరాలను మాత్రం సూచించడం లేదు.