Gold Price Live Update: ఈరోజు గోల్డ్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.!
గోల్డ్ రేట్ స్వల్పంగా పెరుగుదలను చూసింది
తులానికి దాదాపుగా రూ. 300 రూపాయల వరకూ పెరుగుదలను చూసింది
గోల్డ్ రేట్ ఒక వారం పెరిగితే మరొక వారం పడిపోతోంది
Gold Price Live Update: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ స్వల్పంగా పెరుగుదలను చూసింది. మొత్తంగా ఈ వారంలో గడిచిన నుదురోజుల్లో గోల్డ్ మార్కెట్ తులానికి దాదాపుగా రూ. 300 రూపాయల వరకూ పెరుగుదలను చూసింది. వాస్తవానికి, ఇది పెద్ద అమౌంట్ కాకపోయినా, గత 10 రోజులతో పోలిస్తే మాత్రం పెరిగినట్లు చూడవచ్చు. నిజానికి ఫిబ్రవరి 14 తరువాత గోల్డ్ రే మళ్ళి తిరిగి పైకి లేవడం కనిపిస్తుంది. అంతకు ముందు గోల్డ్ రేట్ రేట్ దాదాపుగా 61 వేలను టచ్ చేయడం కూడా మనం చూడవచ్చు.
Gold Price Live Update
ప్రసుతం గోల్డ్ రేట్ కొంచెం ఒడిదుడుకులను చూస్తున్న విషయం గమనించవచ్చు. ఎందుకంటే, గోల్డ్ రేట్ ఒక వారం పెరిగితే మరొక వారం పడిపోతోంది. అయితే, జనవరి నెలలో మాత్రం మొదటి వారం తరువాత చాలా స్థిరంగా కొనసాగింది. ఎక్కువ శాతం గోల్డ్ మార్కెట్ గత నెలలో 63 వేళా రూపాయల మార్క్ వద్దనే కొనసాగింది.
కానీ, జనవరి నెల ప్రారంభంతో పోలిస్తే మాత్రం గోల్డ్ మార్కెట్ ఓవరాల్ గా రూ. 1,000 రూపాయల వరకూ నష్టాలను చూసింది. అయితే, ఇప్పుడు మాత్రం 62 వేల నుండి 63 వేల రూపాయల మధ్యలో తిరుగుతోంది గోల్డ్ మార్కెట్.
Also Read: Honor Magic 6 Series: అదరగొట్టే కెమేరాతో లాంఛ్ కాబోతున్న హానర్ ఫోన్.!
Today’s 24 Carat గోల్డ్ రేట్
ఈరోజు కూడా గోల్డ్ రేట్ 62 వేల మార్క్ పైనే కొనసాగుతోంది. ఇక లైవ్ రేట్ అప్డేట్ ను పరిశీలిస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 62,740 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
Today’s 22 Carat గోల్డ్ రేట్
ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 57,600 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.