Gold Live Update: ఈరోజు బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకోండి.!

Updated on 23-Feb-2023
HIGHLIGHTS

గత వారం చివరి వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం

ఈరోజు గోల్డ్ మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది

గోల్డ్ మార్కెట్ సూచీలు వారాంతానికి మళ్ళి పెరుగుదలను నమోదు చేశాయి

గత వారం చివరి వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం, ధర వారాంతంలో పెరిగింది. అయితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ నిలకడగా కొనసాగుతోంది. గత వారంలో 15 రోజుల కనిష్ఠాన్ని తాకిన గోల్డ్ మార్కెట్ సూచీలు వారాంతానికి మళ్ళి పెరుగుదలను నమోదు చేశాయి. మరి ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన సిటీలతో పాటుగా దేశ రాజధానిలో గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో చూద్దామా. 

Gold Live Update:

ఈరోజు రూ.52,200 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయలు క్రిందకు దిగి రూ.52,100 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,950 నుండి రూ.56,830 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,830 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,830 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,000 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,600 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :