ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు గోల్డ్ రేట్ పైన ఒక లుక్కేద్దామా.!

Updated on 27-Apr-2023
HIGHLIGHTS

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు గోల్డ్ రేట్స్

గత మూడు రోజులుగా క్రిందకు దిగుతూ వచ్చిన గోల్డ్ రేట్

ఈరోజు మార్కెట్ ప్రారంభమవుతూనే గోల్డ్ మార్కెట్ సూచీలు పైపైకి వెళ్లాయి

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు గోల్డ్ రేట్ పైన ఒక లుక్కేద్దామా. ఎందుకంటే, గత మూడు రోజులుగా క్రిందకు దిగుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఈరోజు లాభాలను నమోదు చేసింది. ఈరోజు మార్కెట్ ప్రారంభమవుతూనే గోల్డ్ మార్కెట్ సూచీలు పైపైకి వెళ్లాయి. అయితే, ఈరోజు పెరిగిన ధర భారీ మార్పు కాకపోయినా, గోల్డ్ రేట్ ను గత 5 రోజుల హైయెస్ట్ రేట్ కు సమానం చేసింది. మరి ఈరోజు గోల్డ్ మర్కెట్ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. 

Gold Live Update:

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ (10గ్రా 22K) ధర రూ. 55,650 వద్ద ప్రారంభమై 200 రూపాయల పెరుగుదలను నమోదు చేసి రూ. 55,850 రూపాయల వద్ద ముగిసింది. అలాగే, 10గ్రాముల 22K గోల్డ్ రేట్ మార్కెట్ లో రూ. 60,710 వద్ద మొదలై 220 రూపాయలు పెరిగి రూ. 60,630 వద్ద ముగిసింది. ఈరోజు గోల్డ్ సూచీలు స్వల్పంగా పెరిగిన విషయాన్ని మనం చూడొచ్చు. 

ఈరోజు హైయెస్ట్ రేట్ ఎక్కడ వుంది?

ఈరోజు దేశం మొత్తం మీద చెన్నై లో గోల్డ్ రేట్ అధికంగా వుంది. ఈరోజు చెన్నైలో ఒక తులం 22 క్యారెట్ గోల్డ్ రూ. 56,300 గా ఉండగా, 10 గ్రాముల 24 క్యారెట్ ధర రూ. 61,420 రూపాయలుగా ఉంది. 

తెలుగు రాష్ట్రాలలో రేట్స్ ఎంత?

తెలుగు రాష్ట్రాల మైన్ నగరాలలో ఈరోజు గోల్డ్ రేట్ ఎలా వున్నదని చూస్తే, ఈరోజు హైద్రాబాద్ లో తులం 22K బంగారం ధర రూ. 55,850 గా ఉండగా, తులం 24 క్యారెట్ గోల్డ్ ధర రూ. 60,930 గా వుంది. విజయవాడ లో ఈరోజు 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 55,850 వద్ద కొనసాగుతుండగా, 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ. 60,930 వద్ద కొనసాగుతోంది. 

మొత్తంగా, ఈరోజు గోల్డ్ మార్కెట్ నాలుగు రోజులుగా కొనసాగుతున్న ట్రెండ్ ను చేంజ్ చేసి స్వల్పంగా పైకి చేరుకుంది. అయితే, ఈ పది రోజుల మార్కెట్ ను చూస్తే 800 దిగువనే ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :