Gold Rate Live: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ నిలకడగా కొనసాగుతోంది. గత వారం గోల్డ్ మార్కెట్ లో స్వల్ప మార్పులను నమోదు చెయ్యడం మినహా, గోల్డ్ మార్కెట్ దాదాపుగా స్థిరంగానే వుంది. అయినా కూడా గోల్డ్ రేట్ ప్రస్తుతం హై రేట్ లోనే కొనసాగుతోంది. అయితే, బంగారం ధర మరింత పైపైకి వెళుతుందని నిపుణులు చెబుతున్నారు. గత వారం నుండి నడుస్తున్న గోల్ మార్కెట్ ట్రెండ్ మరియు రేట్ ఎలా ఉన్నదో చూద్దామా.
గత సోమవారం ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 52,200 రూపాయలుగా ఉండగా, వారం మొత్తం మీద 150 రూపాయలు పెరిగి రూ.52,350 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, రూ.56,950 రూపాయల నుండి రూ.57,110 రూపాయల వద్దకు చేరుకుంది. అంటే, గోల్డ్ రేట్ పూర్తిగా వారం మొత్తం నిలకడగానే కొనసాగింది.
ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,110 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,270 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,231 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,071 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.