Gold Price Live: పసిడి ప్రియులకు ట్విస్ట్ .. మళ్ళీ పెరుగు గోల్డ్ రేట్.!
గత రెండు రోజులుగా నేలచూపులు చూసిన గోల్డ్ మార్కెట్
ఈరోజు Gold Price Live: పసిడి ప్రియులకు ట్విస్ట్ ఇచ్చింది
నిన్నటితో పోలిస్తే గోల్డ్ రేట్ ఈరోజు లాభాల బాట పట్టింది
Gold Price Live: గత రెండు రోజులుగా నేలచూపులు చూసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు పసిడి ప్రియులకు ట్విస్ట్ ఇచ్చింది. గడిచిన రెండు రోజుల్లో 2 వేల రూపాయలకు పైగా క్రిందకు దిగిన గోల్డ్ రేట్ ఈరోజు స్వల్పంగా పెరిగింది. గోల్డ్ రేట్ ఇంక తగ్గుతుందేమోనని ఆలోచన చేస్తున్న పసిడి ప్రియుల ఆశలను అడియాసలు చేస్తూ ఈ రోజు మళ్ళీ పెరిగింది. ఈరోజు ప్రధాన మార్కెట్లో కొనసాగుతున్న బంగారం ధర అప్డేట్ ఎలా ఉందో ఒక లుక్ వేద్దాం పదండి.
Gold Price Live
ఈ నెలలో రికార్డు స్థాయి రేటు నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, నిన్న ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ వారం ఇచ్చిన రెండు రోజుల్లోనే రెండు వేలకు పైగా క్రిందకి దిగింది గోల్డ్ రేట్. అంతేకాదు, గత 15 రోజుల కనిష్ట రేటును కూడా నమోదు చేసింది. ఇక గోల్డ్ రేట్ భారీగా పడుతుంది కావచ్చు అని ఆశపడే లోపలే మళ్ళీ గోల్డ్ రేట్ పెరుగుదలను నమోదు చేసింది.
ఈరోజు మార్కెట్ లో మెల్లగా తిరిగి పొందుకున్న బంగారం ధర సాయంత్రానికి తులానికి రూ. 490 రూపాయలు పెరిగి రూ. 72,650 రూపాయల వద్దకు చేరుకుంది. నిన్నటితో పోలిస్తే గోల్డ్ రేట్ ఈరోజు లాభాల బాట పట్టింది.
Also Read: Jio Cinema కోసం New Plans తీసుకు వస్తున్న జియో..!
గత 10 రోజుల గోల్డ్ మార్కెట్ ఎలా ఉంది?
గత్ 1ఓ రోజుల్లో గోల్డ్ మార్కెట్ ఓవరాల్ గా చూస్తే మాత్రం భారీగా తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే, గడిచిన 10 రోజుల్లో గోల్డ్ మార్కెట్ రూ. 73,150 రూపాయల వద్ద మొదలై ఏప్రిల్ 19 న రూ. 74,340 రూపాయల గరిష్ట రేటును చేరుకుంది.
అయితే, మళ్ళీ నష్టాలను చూడటంతో నిన్న రూ. 72,160 రూపాయల కనిష్ట రేటును చూడవలసి వచ్చింది. చివరికి ఈరోజు స్వల్పంగా లాభాలను చూసి రూ. 72,650 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఈ రోజు గోల్డ్ రేట్ అప్డేట్ ఏమిటి ?
ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 72,650 రూపాయలుగా ఉంది. అలాగే, 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 66,600 రూపాయల వద్ద కొనసాగుతోంది.