Gold Price Live: 2023 ముగింపును లాభాలతో ముగించిన గోల్డ్ మార్కెట్ 2024 ఆరంభాన్ని కూడా లాభాలతో ప్రారంభించింది. గత సంవత్సరం చివరి నెలలో బంగారం ధర భారీ ఆటుపోట్లను చూసింది. డిసెంబర్ నెలలో రెండు సార్లు 2023 గరిష్టాన్ని చూసిన గోల్డ్ మార్కెట్, 2024 జనవరిలో కూడా ప్రారంభంలోనే 64 మార్క్ ను చూసింది. డిసెంబర్ 2023 చివరి మూడు రోజులు కూడా మార్కెట్ లో స్థిరంగా నిలిచిన సూచీలలో ఈరోజు మెల్లగా కదలికలు మొదలయ్యాయి.
ఈరోజు మార్కెట్ మొదలవుతూనే బంగారం సూచీలు మెల్లగా కదలికలను చూశాయి. పెద్దగా లాభాలను చూడకపోయినా తులానికి రూ. 220 రూపాయలు పెరిగిం బంగారం ధర, డిసెంబర్ 2023 తరువాత మళ్ళీ 64 వేల రూపాయల మార్క్ ను టచ్ చేసింది.
ఈరోజు ఉదయం రూ. 63,870 రూపాయల వద్ద ప్రారంభమైన 1ఓ గ్రాముల 24 క్యారెట్ బంగారం మార్కెట్ ముగిసే సమయానికి రూ. 220 రూపాయలు పెరిగి రూ. 64,090 రూపాయల వద్ద ఈరోజు క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read : Realme narzo 60X 5G పైన అమేజాన్ ధమాకా ఆఫర్.!
ఇక 22 క్యారెట్ బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర కూడా రూ. 200 రూపాయలు పెరిగింది. అందుకే, రూ. 58,550 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 Carat గోల్డ్ రేట్ రూ. 58, 750 రూపాయల క్లోజింగ్ రేటును సెట్ చేసింది.
జనవరి 2024, ఈరోజు బంగారం ధర ఇన్వెస్టర్లకు శుభారంభాన్ని అందించింది. గత నెలలో గోల్డ్ మార్కెట్ ఓవరాల్ గా చూస్తే లాభాల బాటలోనే నడిచిందని చెప్పవచ్చు. ఎందుకంటే, డిసెంబర్ 1 న 62,950 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ మార్కెట్ నెల చివరి నాటికి రూ. 63,870 రూపాయల వద్ద క్లోజింగ్ ను చూసింది. అంటే, నెల మొత్తం మీద ఓవరాల్ గా తులానికి రూ. 920 రూపాయలు పెరిగింది.
అయితే, నెల మధ్యలో రెండు సార్లు గరిష్ట రేటును గోల్డ్ మార్కెట్ చూసింది. ఆ ధరతో పోలిస్తే గోల్డ్ రేట్ దాదాపుగా రూ. 2,000 రూపాయల వరకూ పెరిగినట్లు చూడవచ్చు. ఇక 2024 గోల్డ్ మార్కెట్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంటుంది.