Gold Price Live: ఈరోజు గోల్డ్ మార్కెట్ అంచనాలను మించి లాభాలను చూసింది. ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతమవుతున్న పసిడి ప్రియులకు ఈరోజు మార్కెట్ అప్డేట్ మరింత భారంగా మారింది. గత నెలలో భారీ రేటు దిశగా కొనసాగిన గోల్డ్ మార్కెట్, ఈ నెలలో మాత్రం తగ్గింపు రేటు దిశగా కొనసాగింది. అంతేకాదు, 20 రోజుల కనిష్ట రేటును కూడా తాకింది. అయితే, ఈరోజు భారీగా లాభాల బాట పట్టిన గోల్డ్ మార్కెట్ మళ్ళీ గరిష్ట రేటు వైపుగా సాగుతోంది.
మే నెల ప్రారంభ రోజున భారీ తరుగుదలను చూసిన గోల్డ్ మార్కెట్ కనిష్ట ధరలు నమోదు చేసింది. అయితే, ఈరోజు మళ్ళీ భారీ పెరుగుదలను చూడటంతో గోల్డ్ రేట్ 73 వేల మార్క్ ను చేరుకుంది. ఈ నెలలో 73 వేల రూపాయల మార్క్ ను గోల్డ్ చేరుకోవడం ఇదే మొదటి సారి.
ఇక మే నెలలో జరిగిన 10 రోజుల గోల్డ్ మార్కెట్ వివరాల్లోకి వెళితే, ఈ 10 రోజుల్లో గోల్డ్ మార్కెట్ ఓవరాల్ గా రూ. 1,500 రూపాయలకు పైగా పైకి పెరిగినట్లు చూడవచ్చు. కానీ, ఈ పది రోజుల్లో గోల్డ్ రేట్ ఎత్తు పల్లాలు చూసింది.
Also Read: ఈ Jio Best Plan తో 200GB డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు అందుకోవచ్చు.!
ఈరోజు మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 72,160 రూపాయల వద్ద ప్రారంభమైంది. అయితే, మార్కెట్ ముగిసే సమయానికి తులానికి రూ. 930 రూపాయల భారీ పెరుగుదలను నమోదు చేయడంతో రూ. 73,090 రూపాయల వద్ద ఈ రోజు క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 66,150 రూపాయల వద్ద స్టార్ట్ అయ్యింది. 22 క్యారెట్ గోల్డ్ రేట్ తులానికి రూ. 850 రూపాయలు పెరిగి రూ. 67,000 వద్ద క్లోజింగ్ సెట్ చేసింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ ధరలు మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ ధరల్లో వ్యత్యాసం ఉంటుందని గమనించాలి.