Gold: మరింతగా పెరిగిన బంగారం ధర..!

Gold: మరింతగా పెరిగిన బంగారం ధర..!
HIGHLIGHTS

బంగారం ధర రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది

గోల్డ్ మార్కెట్ ఒక్కసారిగా పెరుగుదలను నమోదు చెయ్యడం మొదలుపెట్టింది

గత మూడు రోజుల్లోనే దాదాపుగా రూ.1,700 రూపాయల వరకూ పెరిగింది

బంగారం ధర రోజు రోజుకు భారీగా పెరిగిపోతోంది. నిన్న మొన్నటి వరకూ నిలకడగా కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ ఒక్కసారిగా పెరుగుదలను నమోదు చెయ్యడం మొదలుపెట్టింది. గత మూడు రోజుల్లోనే దాదాపుగా రూ.1,700 రూపాయల వరకూ పెరిగింది. అంటే, మీరు అర్ధం చేసుకోవచ్చు గోల్డ్ మార్కెట్ ఎంత దూకుడుగా ఉన్నదో మనం అంచనా వేయవచ్చు. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగుతోందో చూద్దామా.

Gold Rate:

ఈరోజు ఉదయం రూ.52,160 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ఈరోజు 290 రూపాయలు పెరిగి ప్రస్తుతం రూ.52,450 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.57,220 రూపాయల నుండి రూ.330 రూపాయలు పెరిగి రూ.57,220 వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,220 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,450 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,220 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,600 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,370 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,250 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,090 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo