Gold Price: ఈరోజు పసిడి ప్రియులకు షాకిచ్చిన గోల్డ్ మార్కెట్.!

Updated on 10-Mar-2023
HIGHLIGHTS

గత మూడు రోజుల్లో పసిడి ప్రియులకు సానుకూలంగా ఉన్న గోల్డ్ మార్కెట్

గోల్డ్ మార్కెట్ ఈరోజు పసిడి ప్రియులకు షాకిచ్చింది

హోలీ పండుగ వరకూ స్థబ్దుగా నిచ్చిన గోల్డ్ మార్కెట్ ఈరోజు ఒక్కసారిగా ఊపందుకుంది

గత మూడు రోజుల్లో పసిడి ప్రియులకు సానుకూలంగా ఉన్న గోల్డ్ మార్కెట్, ఈరోజు పసిడి ప్రియులకు షాకిచ్చింది. గత మూడు రోజుల్లో బంగారం ధర 1,000 రూపాయలకు పైగా పడిపోయింది. అయితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ ఒక్కసారిగా భారీ పెరుగుదలను నమోదు చేసింది. హోలీ పండుగ వరకూ స్థబ్దుగా నిచ్చిన గోల్డ్ మార్కెట్ ఈరోజు ఒక్కసారిగా ఊపందుకుంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ అప్డేట్ ఏమిటో ఒక లుక్కేద్దామా. 

Gold Price:

ఈరోజు ఉదయం రూ.50,900 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మూడు రోజుల్లో 500 రూపాయలు పెరిగి  ప్రస్తుతం రూ.51,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.55,530 రూపాయల నుండి రూ.540 రూపాయలు పెరిగి రూ.56,070 వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,070 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,070 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,210 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,620 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :