Gold Price: అందనంత ఎత్తులో బంగారం ధర తేలియాడుతోంది. నవంబర్ నెల ప్రారంభం నుండి లాభాలను చూసిన గోల్డ్ మార్కెట్ నెల చివరి నాటికి 18 నెలల గరిష్టాన్ని తాకింది. అయితే, నెల చివరి రోజు గోల్డ్ రేట్ నష్టాన్ని చూడటంతో మళ్ళీ తిరిగి అదే ధరను చేరుకుంది. కానీ ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ లాభాలను చూడటంతో గోల్డ్ రేట్ తిరిగి 63 వేల మార్క్ ను చేరుకుంది. ఈరోజు గోల్డ్ రేట్ మరియు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను తెలుసుకోండి.
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు గోల్డ్ రేట్ తులానికి రూ. 220 రూపాయలు పెరిగి రూ. 62,950 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 62,730 రూపాయల రేటు వద్ద మొదలై రూ. 220 రూపాయల పెరుగుదలను నమోదు చేసి రూ. 62,950 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read : Redmi 13C 5G: బడ్జెట్ 5జి ఫోన్ తీసుకు వస్తున్న షియోమీ.!
ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 57,500 రూపాయల రేటు వద్ద ప్రారంభమై రూ. 200 రూపాయల పెరిగి రూ. 57,700 రూపాయల క్లోజింగ్ ను ఈరోజు నమోదు చేసింది.