Gold Price Down: భారీగా తగ్గిన బంగారం ధర..!

Gold Price Down: భారీగా తగ్గిన బంగారం ధర..!
HIGHLIGHTS

Gold Price Down: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్

బంగారం ధర మార్కెట్ లో భారీగా పడిపోయింది

ఈరోజు బంగారం ధర రెండు నెలల కనిష్ఠాన్ని నమోదు చేసింది

Gold Price Down: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్. బంగారం ధర మార్కెట్ లో భారీగా పడిపోయింది. గత 10 రోజులగా స్థిరంగా కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ గత రెండు రోజుల్లో ఒక్కసారిగా పడిపోయింది. ఈరోజు బంగారం ధర రెండు నెలల కనిష్ఠాన్ని నమోదు చేసింది. జనవరిలో నమోదు చేసిన కనిష్ఠాన్ని ఈరోజు గోల్డ్ మార్కెట్ మరొకసారి చవిచూసింది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఏమిటో తెలుసుకుందామా. 

Gold Price Down:

వారం ప్రారంభం మార్చి 7 న రూ.51,850 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం మూడు రోజుల్లో 950 రూపాయలు క్రిందకు దిగి ఈరోజు రూ.50,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మూడు రోజుల్లో రూ.56,550 రూపాయల నుండి రూ1,020 క్రిందకు దిగజారి రూ.55,530 రేటు వద్ద కొనసాగుతోంది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.50,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,530 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.55,680 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,250 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo