ఈరోజు మార్కెట్ లో గోల్ రేట్ పాత రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. గోల్డ్ మార్కెట్ త్వరలోనే 63 వేలను తాకుతుందని చెప్పిన నిపుణుల జోస్యం అక్షరాలా నిజమయ్యింది. ఈరోజు చెన్నై మార్కెట్ లో గోల్డ్ రేట్ రూ. 63,000 ను చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇతర మార్కెట్ లలో కూడా గోల్డ్ మార్కెట్ 62 పైనే కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్ అప్డేట్ వివరాలను విశదంగా చూద్దామా.
ఈరోజు చెన్నైమార్కెట్ లో గోల్డ్ రేట్ రూ. 63,000 వద్ద ముగిసింది. ఇది 24K స్వచ్ఛమైన 10గ్రాముల గోల్డ్ రేట్ కాగా, 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 57,750 ధర వద్ద ముగిసింది. గమ్మత్తు ఏమిటంటే, ఈ వారంలో ఇప్పటికే గోల్ చెన్నెలో గోల్డ్ రేట్ రూ.1,600 రూపాయలకు పైగా పెరిగింది.
ఈరోజు ప్రధాన మార్కెట్ లో గోల్ రేట్ పెరుగుదలను చూసింది. వారంలో ఇప్పటికే భారీ పెరుగుదలను చూసిన గోల్ మార్కెట్ ఈరోజు కూడా అదే ధోరణనిలో సాగింది. ఈరోజు రూ. 57,000 వద్ద మొదలైన గోల్డ్ రేట్ 200 పెరిగి రూ. 57,200 వద్ద ముగిసింది. 24K గోల్ రేట్ 220 రూపాయలు పెరిగి రూ. 62,400 వద్ద ముగిసింది.
ఇక తెలుగు రాష్టాల ప్రధాన నగరాలైన హైదారాబాద్ & విజయవాడ లలో గోల్డ్ రేట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈరోజు గోల్డ్ 22 క్యారట్ 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ. 57,000 వద్ద మొదలై రూ. 57,000 వద్ద ముగియగా, 10గ్రా 24K గోల్డ్ రేట్ రూ. 62,180 వద్ద మొదలై రూ. 62,180 వద్ద ముగిసింది.
గమనిక: ఆన్లైన్ మార్కెట్ రేట్ మరియు లోకల్ మార్కెట్ రేట్ లలో వ్యత్యాసాలు ఉంటాయని గమనించాలి.