Gold Price: రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్న గోల్డ్ రేట్.!
బంగారం ధర 70 వేల రూపాయల మార్క్ ను దాటి రికార్డ్ నమోదు చేసింది
ఈ నెల మొత్తం బంగారం ధర పెరుగుతూనే వచ్చింది
గోల్డ్ మార్కెట్ మూడు రోజుల్లోనే 70 వేల మార్క్ ని హిట్ చేసింది
Gold Price: ఈరోజు మార్కెట్లో బంగారం ధర 70 వేల రూపాయల మార్క్ ను దాటి రికార్డ్ నమోదు చేసింది. ఈ నెల మొత్తం బంగారం ధర పెరుగుతూనే వచ్చింది. ఈనెల ప్రారంభంలో 68 వేల వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్ మూడు రోజుల్లోనే 70 వేల మార్క్ ని హిట్ చేసింది. ఇక ఈవారం విషయానికి వస్తే ఈ వారంలో సోమవారం నుంచి బంగారం ధర పెరుగుతూనే వచ్చింది. ఈరోజు దేశంలో కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్, రేట్ మరియు ఇతర అప్డేట్లను పరిశీలిద్దాం.
Gold Price
నిన్న మార్కెట్లో తులానికి 700 రూపాయల లాభాన్ని నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, ఈరోజు కూడా రూ. 600 పైగా లాభాన్ని చూసింది. అందుకే, గోల్డ్ మార్కెట్ ఎన్నడూ చూడని హైయెస్ట్ రేటును నమోదు చేసింది. అంతేకాదు నిపుణులు చెప్పిన మాటని ఈరోజు గోల్డ్ మార్కెట్ నిజం కూడా చేసింది. 70 వేల మార్క్ ను తాకుతుందని మూడు నెలల క్రితం నిపుణులు చెప్పిన మాట ఎట్టకేలకు ఈరోజు నిజమయ్యింది.
అంతేకాదు గోల్డ్ రేటు మరింతగా పెరగొచ్చు అని నిపుణులు చెబుతున్న మాట కూడా ఇప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకుంది. వాస్తవానికి 2024 ప్రారంభం నుంచే బంగారం ధర మంచి దూకుడు మీద ఉంది. అదే దూకుడుని కొనసాగించిన గోల్డ్ మార్కెట్ మూడు నెలల్లో తులానికి దాదాపుగా రూ. 6,000 రూపాయలు పైగా పెరిగింది.
Also Read: Jio జబర్దస్త్ ప్లాన్: రూ. 234 కొత్త ప్లాన్ తో 56 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!
24 Carat Gold
ఈరోజు మార్కెట్ లో నడిచిన 24 క్యారెట్ గోల్డ్ రేట్ ను పరిశీలిస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 70,470 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 600 రూపాయలు పెరిగింది.
22 Carat Gold
ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 64,600 రూపాయల రేటు వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 500 రూపాయలు పెరిగింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.