Gold Price: ఎల్లలు దాటిన గోల్డ్ రేట్.. ఈరోజు New అప్డేట్ తెలుసుకోండి.!
ముందుగా అంచనా వేసిన విధంగానే Gold Price ఈరోజు కూడా పెరిగింది
గత వారం ట్రెండ్ ను ఫాలో అయిన గోల్డ్ మార్కెట్
Gold మొదటి రోజు నష్టాలను చూసి, మళ్ళీ పెరుగుదలను నమోదు చేస్తోంది
Gold Price: సోమవారం ముందుగా అంచనా వేసిన విధంగానే గోల్డ్ రేట్ ఈరోజు కూడా పెరిగింది. బంగారం ధర పెరిగింది చాలా స్వల్పమే అయినా ఇది మార్కెట్ నాడిని తెలియ పరుస్తోంది. గత వారం ట్రెండ్ ను ఫాలో అయిన గోల్డ్ మార్కెట్, ఈ వారంలో కూడా మొదటి రోజు నష్టాలను చూసి, మళ్ళీ భారీ పెరుగుదలను నమోదు చేస్తోంది. ఈరోజు మార్కెట్ లో నడుస్తున్న బంగారం ధర మరియు కొత్త అప్డేట్ ల పైన ఒక లుక్కేద్దాం పదండి.
Gold Price Today:
ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర స్థిరంగా కొనసాగుతోంది. దేశీయ మార్కెట్ లో ఈరోజు బంగారం ధర రూ.61,690 రూపాయల వద్ద మొదలై స్వల్పంగా లాభాలను అందుకొని రూ. 61,800 రూపాయల వద్ద కొనసాగుతోంది.
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 Carat గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు రూ. రూ.61,690 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 బంగారం ధర రూ. 110 రూపాయల పెరిగి రూ. 61,800 వద్ద అక్టోబర్ 25వ తేదీ క్లోజింగ్ ను సెట్ చేసింది.
Also Read : BSNL Best Plans: చవక ధరలో వచ్చే లాంగ్ వ్యాలిడిటీ అందించే ప్లాన్స్.!
22 Carat గోల్డ్ రేట్
అలాగే, అక్టోబర్ 25వ తేది 22 Carat గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు రూ. 56,550 రూపాయల వద్ద మొదలై రూ. 100 రూపాయలు పైకి చేరుకొని రూ. 56,650 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్
ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్ ను పరిశీలిస్తే, ఈ వారం ప్రారంభంలో అక్టోబర్ 22 వ తేదిన రూ. 61,750 రూపాయల వద్ద మొదలైన బంగారం ధర అక్టోబర్ 23న రూ. 300 రూపాయలు క్రిందకు దిగి రూ. 61,450 రూపాయల వద్దకు చేరుకోగా, అక్టోబర్ 23 మరియు 24 తేదీ లలో మొత్తంగా 330 రూపాయలు పెరిగి 62 వేల రూపాయలకు అతి చేరువలో నిలిచింది.
ప్రస్తుతం, గోల్డ్ మార్కెట్ లాభాల బాటలోనే నడుస్తోంది మరియు పసిడి ప్రియులకు మాత్రం భారంగా కనిపిస్తోంది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో వ్యత్యాసాలు ఉంటాయి.