Gold Price: ఇటివల మెల్లగా 72 వేలకు చేరుకున్న బంగారం ధర మళ్ళీ తిరిగి పుంజుకుంటోంది. నిన్న మరియు ఈ రోజు కూడా పెరిగిన బంగారం ధర మల్లి తిరిగి 74 వేల రూపాయల మార్క్ ను చేరుకుంది. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం గోల్డ్ రేట్ డౌన్ ఫాల్ లో ఉన్నట్లు చూడవచ్చు. అయితే, ఈ నెల మార్కెట్ అప్డేట్ లతో పోలిస్తే మాత్రం పెరుగుతున్నట్లు గమనించవచ్చు. ఈరోజు మార్కెట్ లో నడుస్తున్న గోల్డ్ అప్డేట్ మరియు లైవ్ రేట్ వివరాలు తెలుసుకోండి.
ఈరోజు మార్కెట్లో గోల్డ్ రేట్ తులానికి 700 రూపాయలకు పైగా పెరుగుదలను చూసి 74 వేల రూపాయల మార్క్ పైకి చేరుకుంది. నిన్న కూడా మార్కెట్ లో తులానికి రూ. 440 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్ నిన్న రూ. 73,250 రూపాయల వద్ద కొనసాగింది. ఇక వారం మొత్తం కొనసాగిన గోల్డ్ మార్కెట్ వివరాల్లోకి వెళితే, ఈ వారంలో మే 14 వ తేదీ రూ. 72,820 రూపాయల కనిష్ఠాన్ని చూసింది. గత రెండు రోజుల్లో తిరిగి పుంజుకున్న గోల్డ్ రేట్ తిరిగి పైకి చేరుకుంది.
ఇక గడిచిన 30 రోజుల గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, గత నెల 16వ తేదీన గోల్డ్ రేట్ రూ. 73,800 రూపాయల వద్ద నడిచింది. అయితే, తర్వాత వరుసగా నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్ మే 1వ తేదీ రూ. 71,150 రూపాయల కనిష్ఠానికి చేరుకుంది. కానీ మెల్లగా పుంజుకున్న గోల్డ్ మార్కెట్ మళ్ళీ తిరిగి 74 వేల మార్క్ ను చేరుకుంది.
Also Read: OnePlus 11R 5G పైన రూ. 10,000 భారీ డిస్కౌంట్ అందించిన Amazon
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ లైవ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 74,020 రూపాయల వద్ద ముగిసింది. ఈరోజు తులానికి గోల్డ్ రేట్ రూ. 770 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది.
ఈరోజు 22 క్యారెట్ గోల్డ్ లైవ్ రేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 67,850 రూపాయల వద్ద క్లోజింగ్ సెట్ చేసింది. ఈరోజు తులానికి 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 770 రూపాయలు పెరిగింది.