పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్..మళ్ళీ పెరిగిన బంగారం ధర.!

Updated on 12-Apr-2023
HIGHLIGHTS

మార్కెట్ లో బంగారం ధర మళ్ళీ పెరిగింది

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్

ఈరోజు పెరిగిన బంగారం ధర

మార్కెట్ లో బంగారం ధర మళ్ళీ పెరిగింది. అంటే, పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. గత నాలుగు రోజుల్లో బంగారం ధర మెల్ల మెల్లగా క్రిందకు దిగుతోందని పసిడి ప్రియులు సంతోషించే లోప్లలే, నిన్న ఈరోజు పెరిగిన బంగారం ధర దెబ్బకి గోల్డ్ రేట్ యధాస్థానికి చేరుకుంది. వాస్తవానికి, గత పది రోజులుగా కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే తులానికి దాదాపుగా 1,600 రూపాయలకు పైగా బంగారం ధర నికర పెరుగుదలను నమోదు చేసింది. ప్రస్తుత లైవ్ గోల్డ్ మార్కెట్ మరియు అప్డేట్ లను ఒక్కసారి వివరంగా చూద్దాం. 

గత 10 రోజుల మార్కెట్

ఏప్రిల్ 3 వ తేదీ ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ.54,700 వద్ద ప్రారంభమయ్యింది. ఈ పదిరోజుల్లో హెచ్చు తగ్గులను నమోదు చేసినా ఈరోజు రూ.56,200 నిలవడంతో మొత్తంగా మార్కెట్ పెరుగుదలను నమోదు చేయడం మనం గమనించవచ్చు. అదే విదంగా 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ ఈరోజు రూ.61,310 వద్ద కొనసాగుతోంది. మొత్తంగా పదిరోజుల మార్కెట్ ని పరిశీలిస్తే గోల్డ్ రేట్ దాదాపుగా 1,600 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. 

ప్రధాన మార్కెట్ లో ఈరోజు గోల్డ్ రేట్

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.55,702 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22K గోల్డ్ రేట్, 500 రూపాయలు పెరిగి రూ.56,202 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.60,760 వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24K గోల్డ్ రేట్, 552 రూపాయలు పెరిగి రూ.61,132 రూపాయల వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు గోల్డ్ రేట్

ఇక తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడ నగరాలలో ఈరోజు గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22K బంగారం ధర రూ.56,200 గా వుంది మరియు 10 గ్రాముల 24K బంగారం ధర రూ.61,310 గా వుంది. అలాగే, విజయవాడలో కూడా 10 గ్రాముల 22K బంగారం ధర రూ.56,200 గా ఉండగా, 10 గ్రాముల 24K బంగారం ధర రూ.61,310 రూపాయల వద్ద కొనసాగుతోంది. 

అధిక ధర ఎక్కడ ఉందంటే?

దేశం మొత్తం మీద చెనై లో ఈరోజు గోల్డ్ అధిక ధరను నమోదు చేసింది. ఈరోజు చెన్నైలో తులం 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ.56,800 గా ఉండగా 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ.61,960 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Note: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :