Gold Price: మార్కెట్ లో దూసుకు పోతున్న బంగారం ధర.. New Price వివరాలు తెలుసుకోండి.!
Gold Price: మార్కెట్ లో దూసుకు పోతున్న బంగారం ధర
బంగారం ధర ఇన్వెస్టర్లకు భారీ లాబాలను తెచ్చి పెడుతోంది
భారీగా తగ్గిన బంగారం ధర మళ్ళీ తిరిగి పుంజుకొని మార్కెట్ లో దూసుకు పోతోంది
Gold Price: మార్కెట్ లో దూసుకు పోతున్న బంగారం ధర ఇన్వెస్టర్లకు భారీ లాబాలను తెచ్చి పెడుతోంది. ఈ నెల ప్రారంభం నుండి భారీగా తగ్గిన బంగారం ధర మళ్ళీ తిరిగి పుంజుకొని మార్కెట్ లో దూసుకు పోతోంది. అయితే , ప్రస్తుతం కూడా బంగారం ధర 59 వేల రూపాయల దిగువనే కొనసాగుతోంది. కానీ మార్కెట్ నిపుణుల అంచనా మరోలా వుంది. అందుకే, ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ మరియు ఈరోజు బంగారం ధర వివరాల పైన ఒక లుక్కేద్దామా.
Gold New Price Update
ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ లాభాలను చూసింది. ఈరోజు ఉదయం రూ. 58 200 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర తులానికి రూ. 330 రూపాయలు పెరిగి, సాయంత్రానికి రూ. 58,530 రూపాయల క్లోజింగ్ ను ఈరోజు నమోదు చేసింది.
24 Carat గోల్డ్ రేట్
ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 58,530 రూపాయల వద్ద కొసాగుతోంది మరియు ఈరోజు కూడా గోల్డ్ రేట్ పెరుగుధలను నమోదు చేసింది. గడిచిన 5 రోజుల్లో రూ. 1,300 రూపాయల వరకూ బంగారం ధర పెరిగింది. అలాగే, హైదరాబాద్, విజయవాడ, బెంగుళూరు మరియు కలకత్తా వంటి ప్రధాన నగరాలలో ఈరోజు ఇదే ధర కొసాగింది.
Also Read : Dolby Atmos సౌండ్ బార్ పైన Amazon GIF Sale సూపర్ డీల్.!
22 Carat గోల్డ్ రేట్
ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ. 53,650 రూపాయల వద్ద కొనసాగుతోంది.
అక్టోబర్ గోల్డ్ మార్కెట్ అప్డేట్
అక్టోబర్ నెలలో గోల్డ్ మార్కెట్ 8 నెలల కనిష్ఠాన్ని చూసిన సంగతో తెలిసిందే. అయితే, తరువాత పుంజుకున్న గోల్డ్ రేట్ మళ్ళి తిరిగి 60 వేల మార్క్ వైపుగా పరుగులు తీస్తోంది. అక్టోబర్ 5 న రూ. 57,160 రూపాయల వద్ద కొనసాగిన గోల్డ్ మార్కెట్, ఈరోజు రూ. 58,530 రూపాయల వద్ద కొనసాగుతోంది.
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.