Gold Price Hike: మళ్ళీ పెరుగుతున్న గోల్డ్ రేట్.. ఈరోజు ప్రైస్ ఎంతంటే.!
గోల్డ్ మార్కెట్ మెల్లగా పుంజుకుంటోంది
నిన్న మార్కెట్ లో స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్
గత నెలలో గోల్డ్ రేట్ ఎన్నడూ చూడని గరిష్ట రేటు వద్ద కొనసాగింది
Gold Price Hike: గత వారం మొత్తం కనిష్ట రేటును చూసిన గోల్డ్ మార్కెట్ మెల్లగా పుంజుకుంటోంది. మే నెల ప్రారంభం నుండి గోల్డ్ రేట్ కనిష్ట ధరలను అంటి పెట్టుకొని తిరిగింది. అయితే, గోల్డ్ మార్కెట్ ఇప్పుడు మెల్లగా పుంజుకుంటోంది. నిన్న మార్కెట్ స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా బాటలో కొనసాగింది.
Gold Price Hike
గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా స్వల్పంగా పెరుగుదలను నమోదు చేసింది. నిన్న మరియు ఈరోజు పెరిగిన రేట్, మెల్లగా 72 వేల రూపాయల మార్క్ ను దాటేలా చేసింది. అయితే, గత నెలలో గోల్డ్ రేట్ ఎన్నడూ చూడని గరిష్ట రేటు వద్ద కొనసాగింది.
అయితే, గత నెల ఇదే రోజున కొనసాగిన గోల్డ్ రేట్ తో పోలిస్తే, ఈరోజు గోల్డ్ రేట్ రూ. 1,000 రూపాయల గరిష్ట రేటు పైన కొనసాగుతోంది. అంతేకాదు, గత వారంతో పోల్చి చూస్తే మాత్రం
గోల్డ్ రేట్, అదే 72 వేల రూపాయల మార్క్ వద్ద కొనసాగుతోంది.
కానీ, గత శనివారం కొనసాగిన గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు గోల్డ్ మార్కెట్ రూ. 500 రూపాయలకు పైగా పెరిగింది. ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 మరియు 22 క్యారెట్ గోల్డ్ రేట్ వివరాలను క్రింద చూడవచ్చు.
Also Read: ఇండియన్ టెక్ బ్రాండ్ నుండి పెద్ద Luxury AMOLED డిస్ప్లే స్మార్ట్ వాచ్ లాంచ్.!
24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 330 రూపాయల పెరుగుదలను చూసి రూ, 72,380 రూపాయల వద్ద కొనసాగుతోంది.
24 క్యారెట్ గోల్డ్ రేట్
అలాగే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 300 రూపాయలు పెరిగి రూ, 66,350 రూపాయల వద్ద ముగిసింది.
గమనిక: ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.