Gold Update:ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకోండి.!

Updated on 15-Feb-2023
HIGHLIGHTS

ఈవారం మొదటి రోజు నుండి గోల్డ్ మార్కెట్ కొంచెం శాంతించింది

ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది

గత రెండు రోజులు స్వల్పంగా క్రిందకు జారిన సూచీలు ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి

ఈవారం మొదటి రోజు నుండి గోల్డ్ మార్కెట్ కొంచెం శాంతించింది. అంతేకాదు, ఈరోజు కూడా గోల్డ్ మార్కెట్ స్థిరంగా కొనసాగుతోంది. గత రెండు రోజులు స్వల్పంగా క్రిందకు జారిన సూచీలు ఈరోజు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇక ప్రస్తుత బంగారం ధర వారం రోజుల కనిష్టం వద్ద కొనసాగుతోంది. మరి ఈరోజు మార్కెట్ లో బంగారం ధర ఎలా ఉన్నదో చూద్దామా. 

Gold Update:

ఈ సోమవారం రూ.52,600 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.52,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,380 నుండి రూ.57,160 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,240 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,240 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.57,310 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.53,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,140 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :