Gold Price Live: ఈరోజు కూడా పడిపోయిన బంగారం ధర.!

Gold Price Live: ఈరోజు కూడా పడిపోయిన బంగారం ధర.!
HIGHLIGHTS

మార్కెట్ లో బంగారం ధర ఈరోజు కూడా పడిపోయింది

గత కొన్ని రోజులుగా గోల్డ్ మార్కెట్ క్రిందకు దిగుతోంది

ఈ నెల కనిష్ఠాన్ని ఈరోజు గోల్డ్ మార్కెట్ నమోదు చేసింది

మార్కెట్ లో బంగారం ధర ఈరోజు కూడా పడిపోయింది. గత కొన్ని రోజులుగా గోల్డ్ మార్కెట్ క్రిందకు దిగుతోంది మరియు ఈరోజు కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యింది. అంతేకాదు, ఈ నెల కనిష్ఠాన్ని ఈరోజు గోల్డ్ మార్కెట్ నమోదు చేసింది. ఈ వారం రోజుల్లో బంగారం ధర  తులానికి దాదాపుగా 650 రూపాయలు క్రిందకు దిగింది. మరి ఈరోజు దేశవ్యాపంగా గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగుతుందో చూడండి.  

Gold Price Live:

నిన్న ప్రధాన మార్కెట్ లో రూ.51,700 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు క్రిందకు దిగి రూ.51,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,510 నుండి క్రిందకు దిగి రూ.56,180 రూపాయల వద్దకు చేరుకుంది.    

ఈరోజు బంగారం ధర

ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,180 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,180 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,330 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,100 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,840 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo