ఏప్రిల్ 14 తరువాత భారీగా తగ్గిన బంగారం ధర.!

Updated on 20-Apr-2023
HIGHLIGHTS

ఏప్రిల్ నెల పసిడి ప్రియులకు చేదు అనుభవాన్ని మిగిలించింది

ఈ నెలలో గోల్డ్ రేట్ ఎన్నడూ చూడనంతగా పెరిగింది

ఎట్టకేలకు గోల్డ్ రేట్ మళ్ళా తిరిగి క్రిందకు దిగింది

ఏప్రిల్ నెల పసిడి ప్రియులకు చేదు అనుభవాన్ని మిగిలించింది. ఈ నెలలో గోల్డ్ రేట్ ఎన్నడూ చూడనంతగా పెరిగింది మరియు ఏప్రిల్ 14న అత్యధిక రేటును కూడా మార్క్ చేసింది. అయితే, గోల్డ్  మార్కెట్ స్థిరత్వాన్ని చూపకపోవడం పసిడి ప్రియులకు మింగుడు పడని విషయంగా మారింది. ఎందుకంటే, బంగారం ధరలో చాలా వేగవమైన మార్పులు జరగడమే ఇందుకు కారణంగా చెప్పవచ్చు. 

ఇక ఈ నెలలో ఆల్ టైమ్ హై రేటును చూసిన తరువాత, గోల్డ్ రేట్ మళ్ళా తిరిగి క్రిందకు దిగింది. ఏప్రిల్ 14న తులం స్వచ్ఛమైన 24K బంగారం ధర రూ.61,800 మార్క్ వద్ద చేరుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే, తరువాత రోజు ఏప్రిల్ 15న గోల్డ్ ధర 750 రూపాయలకు పైగా పడిపోయింది. 

ఇక ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 24K గోల్డ్ రేట్ రూ.60,920 వద్ద కొనసాగుతోంది. అంటే, ఏప్రిల్ 17 నుండి ఈరోజు వరకూ చూస్తే, దాదాపుగా 880 రూపాయల వరకూ గోల్డ్ రేట్ క్రిందకు దిగింది. మరి ఈరోజు ప్రధాన మరియు తెలుగు రాష్ట్రాలలో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదో లేటెస్ట్ అప్డేట్ చూద్దామా. 

గోల్డ్ మార్కెట్ అప్డేట్

ఈరోజు 22K (10 gr) బంగారం ధర ప్రధాన మార్కెట్ లో రూ. 55,850 వద్ద కొనసాగుతోంది మరియు 24K (10 gr)స్వచ్ఛమైన గోల్డ్ రేట్ రూ. 60,920 రూపాయల వద్ద కొనసాగుతోంది.

హైదరాబాద్

ఈరోజు హైదరాబాద్ లో గోల్డ్ రేట్ ను చూస్తే, హైదరాబాద్ లో ఒక తులం 22K బంగారం ధర రూ. 55,850 గా ఉండగా, 24K స్వచ్ఛమైన పసిడి ధర రూ. 60,920 గా ఉన్నది.

విజయవాడ

ఇక విజయవాడ లో పసిడి రేట్ వివరాల్లోకి వెళితే, 22 క్యారెట్ (10గ్రా) ధర రూ. 55,850 గా ఉంటే, 24K మేలిమి బంగారం ధర రూ. 60,920 గా ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :