Gold Price: మళ్ళీ దారికొచ్చిన బంగారం ధర.!

Updated on 06-Mar-2023
HIGHLIGHTS

బంగారం ధర మళ్ళీ దారికొచ్చినట్లు కనిపిస్తోంది

బంగారం ధరలో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది

ఇప్పటికీ కూడా బంగారం ధర మార్కెట్ లో ప్రియంగానే వుంది

గత వారం చివరిలో మెల్లగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ దారికొచ్చినట్లు కనిపిస్తోంది. గత రెండు రోజులుగా బంగారం ధరలో ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఇప్పటికీ కూడా బంగారం ధర మార్కెట్ లో ప్రియంగానే వుంది. గత నెలలో కనిష్ఠాన్ని నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఈ నెల ప్రారంభం నుండి మెల్లమెల్లగా పెరుగుదలను నమోదు చెయ్యగా, ప్రస్తుతం నిలకడగా కొనసాగుతోంది. 

Gold Price:

ఈరోజు ఉదయం రూ.51,850 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం స్థిరంగా రూ.51,850 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు రూ.56,550 రూపాయల వద్ద స్థిరంగా నిలబడింది.    

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు గోల్డ్ మార్కెట్ విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,850 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,550 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.56,700 గా ఉంది. అలాగే, ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నై లో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నై లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,270 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.    

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :