Gold Price: డౌన్ ఫాల్ ట్రెండ్ ఫాలో అవుతున్న గోల్డ్ మార్కెట్..!
డౌన్ ఫాల్ ట్రెండ్ ఫాలో అవుతున్న గోల్డ్ మార్కెట్
గడిచిన మూడు రోజులు కూడా గోల్డ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ నే చూసింది
ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ రేట్ మరియు అప్డేట్ వివరాలను తెలుసుకోండి
Gold Price: డౌన్ ఫాల్ ట్రెండ్ ఫాలో అవుతున్న గోల్డ్ మార్కెట్. గడిచిన మూడు రోజులు కూడా గోల్డ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ నే చూసింది. 2024 ప్రారంభంలో బంగారం ధర గరిష్టాన్ని చూసిన తరువాత, తిరిగి మళ్ళి క్రిందకు దిగడం కొనసాగించింది. మూడు రోజులుగా క్రిందకు దిగినా కూడా గోల్డ్ మార్కెట్ ఈరోజుకు కూడా 63 వేల రూపాయల వద్దనే కొనసాగుతోంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ లైవ్ రేట్ మరియు అప్డేట్ వివరాలను తెలుసుకోండి.
Gold Price Update
గోల్డ్ రేట్ ప్రస్తుతం క్రిందకు దిగజారుతోంది. జనవరి 2వ తేది రూ. 64,090 వద్ద మొదలైన గోల్డ్ రేట్, మూడు రోజుల్లో రూ. 820 రూపాయలు క్రిందకు దిగజారి రూ. 63,270 రూపాయల వద్దకు చేరుకుంది. గత నెలతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా క్రిందకు దిగింది.
24 క్యారెట్ గోల్డ్
ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 63,380 రూపాయల వద్ద మొదలై రూ. 63,270 రూపాయల క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read : iQOO Neo9 Pro Launch అనౌన్స్ చేసిన ఐకూ..కొత్త స్క్వేర్ కెమేరా సెటప్ తో వస్తోంది.!
22 క్యారెట్ గోల్డ్
ఇక ఈరోజు మార్కెట్ లో 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు రూ. 58,100 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ రేట్ రూ. 58,000 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
గడిచిన 10 రోజుల గోల్డ్ రేట్ అప్డేట్
గడిచిన 10 రోజుల గోల్డ్ రేట్ అప్డేట్ ను చూస్తే, 10 రోజుల క్రితం డిసెంబర్ 27న రూ. 63,820 రూపాయల వద్ద మొదలైన బంగారం ధర ఈరోజు రూ. 63,270 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, గడిచిన 10 రోజుల్లో హెచ్చు తగ్గులను చూసిన బంగారం ధర ఓవరాల్ గా రూ. 550 రూపాయల పెరుగుదలను చూసింది.
అయితే, ఈ సంవత్సరం గోల్డ్ మార్కెట్ 65 వేల రూపాయల వరకూ చేరుకునే అవకాశం ఉండవచ్చని నిపుణులు హింట్ ఇస్తున్నారు. అయితే, మార్కెట్ లో బంగారం ధరను చూస్తుంటే అంచనా ధర ఎలా ఉండబోతుంది అనే విషయం అర్ధం కావడం లేదు.