ఈరోజు కూడా పడిపోయిన గోల్డ్ రేట్..ఈరోజు తులం ధర ఎంతంటే.!

ఈరోజు కూడా పడిపోయిన గోల్డ్ రేట్..ఈరోజు తులం ధర ఎంతంటే.!
HIGHLIGHTS

మార్కెట్ లో ఈరోజు కూడా పడిపోయిన గోల్డ్ రేట్

భారీగా పెరిగిన బంగారం ధర మెల్లమెల్లగా క్రిందకు దిగి వస్తోంది

గోల్డ్ రేట్ గత మూడు నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా క్రిందకు దిగింది

మార్కెట్ లో ఈరోజు కూడా పడిపోయిన గోల్డ్ రేట్. భారీగా పెరిగిన బంగారం ధర మెల్లమెల్లగా క్రిందకు దిగి వస్తోంది. గత వారం నాలుగు నెలల గరిష్టాన్ని నమోదు చేసిన గోల్డ్ రేట్, గత మూడు నాలుగు రోజులుగా కొద్ది కొద్దిగా క్రిందకు దిగింది. అయినా కూడా ఈరోజు కూడా బంగారం ధర 60 వేల మార్క్ నుండి క్రిందకు దిగలేదు. అయితే, దూసుకుపోతున్న గోల్డ్ మార్కెట్ కి ప్రస్తుతానికి కళ్లెం పడినట్లు అనిపిస్తోంది. మారి ఈరోజు పసిడి ధర అప్డేట్ పైన ఒక లుక్కేద్దామా. 

Gold Rate:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.55,900 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.390 రూపాయలు క్రిందకు దిగి రూ.55,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.60,860 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,430 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు బంగారం ధర రూ.430 రూపాయల తరుగుదలను చూసింది.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,430 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,430 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,580 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,000 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,100 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo