Gold Price Drop: మహిళలకు గుడ్ న్యూస్.. ఈరోజు భారీగా తగ్గిన గోల్డ్ రేట్.!
ఏప్రిల్ నెల మొత్తం మదుపర్లకు లాభాలు తెచ్చి పెట్టిన గోల్డ్ మార్కెట్
గోల్డ్ మార్కెట్ మే నెల ప్రారంభం అవుతూనే డీలా పడింది
ఈరోజు గోల్డ్ రేట్ 20 రోజుల కనిష్ట ధరను నమోదు చేసింది
Gold Price Drop: ఏప్రిల్ నెల మొత్తం మదుపర్లకు అద్భుతమైన లాభాలు తెచ్చి పెట్టిన గోల్డ్ మార్కెట్, మే నెల ప్రారంభం అవుతూనే డీలా పడింది. ఏప్రిల్ నెలలో మొదటి రోజు నుండి ప్రారంభమైన గోల్డ్ రేట్ జైత్రయాత్ర నెల చివరి వరకు కొనసాగింది. అయితే, మే నెల మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రారంభమయ్యింది.
Gold Price Drop
ఏప్రిల్ నెల చివరి మూడు రోజులు గోల్డ్ మార్కెట్ స్తబ్దుగా కొనసాగింది. అయితే, ఈరోజు ఒక్కసారిగా గోల్డ్ మార్కెట్ భారీగా నష్టాలను చూడటంతో, ఈరోజు గోల్డ్ రేట్ 20 రోజుల కనిష్ట ధరను నమోదు చేసింది. అంతేకాదు, గోల్డ్ మార్కెట్ పైన నిపుణల అంచనాలను తలకిందులు కూడా చేసింది.
అయితే, భారీగా పెరుగుతున్న గోల్డ్ రేట్ లతో సతమవుతున్న పసిడి ప్రియులకు మాత్రం ఊరట అందించింది. ఈ వారం గోల్డ్ రేట్ అప్డేట్ ను చూస్తే, గడిచిన మూడు రోజుల్లో గోల్డ్ రేట్ మొత్తంగా రూ. 1,420 రూపాయలు క్రిందకు దిగింది. అంతేకాదు, ఈరోజు గోల్డ్ మార్కెట్ మదుపరులకు నిరాశనే మిగిల్చింది.
Also Read: Pushpa 2 First Single: ఆరు భాషల్లో ‘నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే’ సాంగ్ రిలీజ్.!
వాస్తవానికి, 10 రోజుల క్రితం ఏప్రిల్ 23వ తేదీన కూడా గోల్డ్ మార్కెట్ భారీగా తగ్గింది. ఏప్రిల్ 23న గోల్డ్ రేట్ ఒక్కసారిగా రూ. 1,530 రూపాయలు క్రిందకు దిగజారింది. ఆ తర్వాత, ఇంత మొత్తంలో ఒక్కసారిగా కిందకు ఈరోజు దిగజారింది.
24 క్యారెట్ గోల్డ్ రేట్:
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 71,510 రూపాయల వద్ద నిలిచింది.
22 క్యారెట్ గోల్డ్ రేట్:
ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 22 క్యారెట్ బంగారం ధర అప్డేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 65,550 రూపాయల వద్ద క్లోజింగ్ సెట్ చేసింది.