Gold Price Drop: మార్కెట్ లో బంగారం ధర మల్లి నేలచూపులు చూసింది. గత వారంలో ఎంతైతో పెరిగిందో, గడిచిన రెండు రోజుల్లో అంతే దిగజారింది. అంతేకాదు, గోల్డ్ మార్కెట్ మళ్ళీ గత వారం రోజుల కనిష్టాన్ని చేరుకుంది. కొత్త సంవత్సరం గోల్డ్ మార్కెట్ లో అనుకోని పరిణామాలను చూస్తున్న విషయం అది నుండే జరుగుతోంది. అయితే, గోల్డ్ మార్కెట్ ఇదే ట్రెండ్ ను కొనసాగిస్తుందా? లేక సర్దుకొని ముందుకు సాగుతోందో వేచి చూడాలి.
ఈరోజు మార్కెట్ లో బంగారం ధర భారీ నష్టాన్ని చూసింది. ఈరోజు బంగారం ధర తులానికి రూ. 350 రూపాయలు క్రిందకు దిగజారింది. అందుకే, ఈరోజు గోల్డ్ మార్కెట్ రూ. 63,330 రూపాయల వద్ద మొదలైన బంగారం ధర రూ. 62,950 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఇక ఈ వారం రోజుల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే, గడచిన వారం రోజుల్లో బంగారం ధర రూ. 62,830 రూపాయల వద్ద మొదలై మెల్లగా రూ. 63,440 వద్దకు చేరుకుంది. అయితే, గోల్డ్ మార్కెట్ మల్లి నష్టాలను చూడటంతో బంగారం ధర ఈరోజు మళ్ళీ రూ. 62,950 రూపాయల వద్దకు వచ్చి చేరింది.
Also Read : Flipkart Sale 2024: 20 వేలకే పెద్ద QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్ సేల్.!
ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న 24 క్యారెట్ ప్రైస్ వివరాల్లోకి వెళితే, ఈరోజు రూ. 63,330 రూపాయల వద్ద మొదలైన గోల్డ్ రేట్ రూ. 62,950 రూపాయల క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే, ఈరోజు మార్కెట్ లో బంగారం ధర తులానికి రూ. 380 రూపాయల నష్టాన్ని నమోదు చేసింది.
ఇక 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ విషయానికి వస్తే, ఈరోజు రూ. 58,050 రూపాయల వద్ద మొదలైన 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ రూ. 57,700 రూపాయల వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది. అంటే, ఈరోజు మార్కెట్ లో ఒక తులం 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 350 రూపాయలు క్రిందకు దిగజారింది.