Gold Price Drop: ఈ వారం పసిడి రూటు మారినట్లు క్లియర్ గా కనిపిస్తోంది. గత వారం నుండి మొదలైన పసిడి డౌన్ ట్రెండ్ ఈ వారం కూడా కంటిన్యూ అయ్యింది. మొత్తంగా చూస్తే గోల్డ్ మార్కెట్ ప్రస్తుతం 62 వేల మార్క్ ను టచ్ చేసింది. 2024 సంవత్సరం ప్రారంభంలో 64 వేళా రూపాయల వద్ద ప్రారంభమైన గోల్డ్ మార్కెట్, ఇప్పుడు రూ. 2,000 రూపాయల వరకూ క్రిందకు దిగజారి 62 వేల మార్క్ ను చేరుకుంది. మరి ఈరోజు మరియి ఈ వారం కొనసాగిన గోల్డ్ మార్కెట్ ప్రయాణం ఎలా ఉన్నదో ఒక లుక్కేద్దామా.
ఈ వారంలో సోమవారం నుండి ప్రారంభమైన గోల్డ్ రేట్ డౌన్ ట్రెండ్ ఈరోజు కూడా ఫాలో అయ్యింది. గడిచిన మూడు రోజుల్లో తులానికి రూ. 770 రూపాయల పతనాన్ని చూసిన గోల్డ్ మార్కెట్, ఈరోజు కూడా తులానికి రూ. 110 రూపాయల పాఠాన్ని చూసింది. అంటే, ఈ వారంలో ఇప్పటి వరకూ మొత్తంగా తులానికి రూ. 870 రూపాయల పతనాన్ని చూసింది.
ఇక ఈ నెల ప్రారంభం నుండి కొనసాగిన గోల్డ్ మార్కెట్ ప్రయాణాన్ని పరిశీలిస్తే, ఈ నెలలో ఫిబ్రవరి 1వ తేది రూ. 63,440 రూపాయల వద్ద ప్రారంభమైన ఒక తులం గోల్డ్ రేట్ మొత్తంగా రూ. 1,330 రూపాయల నష్టాన్ని చూసి రూ. 62,070 రూపాయల వద్ద కొనసాగుతోంది.
Also Read: Airtel Plan: రూ. 49 ప్లాన్ పైన మరిన్ని ప్రయోజనాలు జత చేసిన ఎయిర్టెల్.!
ఇక ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న స్వచ్ఛమైన బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 62,070 రూపాయల వద్ద కొనసాగుతుంది.
అలాగే, 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 56,900 రూపాయల వద్ద కొనసాగుతోంది.
2023 నవంబర్ 25వ తేదీ తరువాత బంగారం ధర ఇంత తక్కవగా నమోదు అవ్వడం ఇది రెండవసారి.