నిన్నటి తో సహా గత వారం మొత్తం అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరకు ఈరోజు బ్రేకులు పడ్డాయి. అంతేకాదు, ఈరోజు మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా తరుగుదలను నమోదు చేసింది. నిన్నటి వరకూ బంగారం కొనాలని ఎదురుచూస్తున్న వారికి ఎదురు చూపులే మిగిలినా ఈరోజు మార్కెట్ లో గోల్డ్ ధర శుభ పరిణామంగా కనిపిస్తోంది. బంగారం దారి నామమాత్రంగానే తగ్గినా మార్కెట్ పోకడకు అడ్డుకట్ట పడిందని నిపుణులు భావిస్తున్నారు. ఈరోజు గోల్డ్ మార్కెట్ ఎలా కొనసాగుతుందో పరిశీలిద్దామా.
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,260 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 460 రూపాయలు క్రిందకు దిగి, రూ.47,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.52,150 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.52,300 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,890 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.