Gold Price: ఈ నెల హైఎస్ట్ రేటుతో పోలిస్తే 2 వేలు తగ్గిన బంగారం ధర.!
ఈ నెల హైఎస్ట్ రేటుతో పోలిస్తే 2 వేలు తగ్గిన బంగారం ధర
డిసెంబర్ నెల బంగారం మార్కెట్ చాలా విపరీతమైన పెరుగుదలను చూసింది
ఈరోజు బంగారం ధర స్వల్పంగా దిగజారింది మరియు ఈ నెల కనిష్ఠాన్ని చూసింది
Gold Price: ఈ నెల హైఎస్ట్ రేటుతో పోలిస్తే 2 వేలు తగ్గిన బంగారం ధర. డిసెంబర్ నే బంగారం మార్కెట్ చాలా విపరీతమైన పెరుగుదలను చూసింది. అయితే, గరిష్ట రేటును చూసిన గోల్డ్ మార్కెట్, ఎక్కువ కాలం స్థిరంగా నిలబడలేకపోయింది. వాస్తవానికి, డిసెంబర్ మొదటి వారంలో బంగారం ధర భారీగా పెరుగుదలను చూసింది. అయితే, డిసెంబర్ రెండవ వారంలో భారీగా నష్టాలను చూసి క్రిందకు దిగింది. ఈరోజు మార్కెట్ లో కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ మరియు గోల్డ్ రేట్ అప్డేట్ వివరాలు ఎలా ఉన్నాయో ఒక లుక్కేద్దామా.
Today Gold Price:
ఈరోజు బంగారం ధర స్వల్పంగా దిగజారింది మరియు ఈ నెల కనిష్ఠాన్ని చూసింది. ఈరోజు మార్కెట్ లో బంగారం ధర రూ. 220 రూపాయలు క్రిందకు దిగింది. నిన్న మార్కెట్ లో బంగారం ధర రూ. 62,350 రూపాయలుగా ఉండగా ఈరోజు రూ. 62,130 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
Also Read : 100X జూమ్ కెమేరాతో రేపు సాయంత్రం లాంచ్ కాబోతున్న iQOO 12 5G
24 క్యారెట్ బంగారం ధర
ఈరోజు ఉదయం రూ. 62,350 వద్ద మొదలైన 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 62,130 రూపాయల వద్దకు చేరుకొని క్లోజింగ్ ను సెట్ చేసింది. గత వారం చివరి రోజైన శనివారం మరియు ఈ వారం మొదలైన సోమవారం రెండు రోజుల్లో తులానికి రూ. 820 రూపాయలు క్రిందకు దిగింది.
22 క్యారెట్ బంగారం ధర
ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర రూ. 56,950 వద్ద కొనసాగుతోంది. గడిచిన రెండు ఈరోజుల్లో బంగారం ధర రూ. 750 రూపాయలు క్రిందకు దిగింది.
గమనిక : ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి