Gold Price: మరింత తగ్గినా బంగారం ధర.. ఈరోజు New రేటు తెలుసుకోండి.!
ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర తగ్గు ముఖం పట్టింది
గడిచిన మూడు రోజుల్లో బంగారం ధర రూ. 500 వరకూ తగ్గు ముఖం
గోల్డ్ మార్కెట్ ఇప్పటికీ జోరుగానే కొసాగుతోంది
Gold Price: ఈరోజు కూడా మార్కెట్ లో బంగారం ధర తగ్గు ముఖం పట్టింది. ఇప్పటికే గడిచిన మూడు రోజుల్లో బంగారం ధర రూ. 500 వరకూ తగ్గు ముఖం పట్టగా, ఈరోజు మరింత దిగజారింది. ఇటీవలి గరిష్ట ధరతో పోలిస్తే బంగారం ధర ప్రసుతం రూ. 1,500 వరకూ క్రిందకు దిగజారింది. అయితే, గోల్డ్ మార్కెట్ ఇప్పటికీ జోరుగానే కొసాగుతోంది. ఈ సంవత్సరం 55 వేల వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్ ప్రస్తుతం 61 వేల వద్ద కొసాగుతోందంటే గోల్డ్ రేట్ ఎంతగా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈరోజు మార్కెట్ లో గోల్డ్ New రేటు ఏమిటో తెలుసుకుందామా.
Todays Gold Price:
ఈరోజు మార్కెట్ లో కొసాగుతున్న బంగారం ధర వివరాల్లోకి వెళితే, ఈరోజు ఉదయం రూ. 61,360 రూపాయల వద్ద మొదలైన ఒక తులం గోల్డ్ రేట్ తులానికి రూ. 160 రూపాయలు క్రిందకు దిగి రూ. 61,200 రూపాయల వద్ద కొసాగుతోంది. గత మూడు రోజుల్లో బంగారం ధర రూ. 500 రూపాయలకు పైగా పడిపోయింది మరియు ఈరోజు కూడా అదే ట్రెండ్ ఫాలో అయ్యింది.
Also Read : JioPhone Prima: ఈరోజు నుండి మొదలైన జియో New ఫీచర్ ఫోన్ సేల్.!
24 Carat & 24 Carat బంగారం రేటు
ఈరోజు మార్కెట్ లో కొసాగుతున్న 24 Carat బంగారం రేటు విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 61,360 రూపాయల వద్ద మొదలై రూ. 160 రూప్యాలు క్రిందకు దిగి రూ. 61,200 రూపాయల వద్ద స్థిరపడింది.
అలాగే, ఈరోజు మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 56,250 రూపాయల వద్ద ప్రారంభమై రూ. 150 రూపాయలు క్రిందకు దిగి రూ. 56,200 రూపాయల వద్దకు చేరుకొని స్థిరపడింది.
ఈ వారం బంగారం ధర ఎలా వుంది?
ఇక ఈ వారం బంగారం ధర ఎలా ఉందని చూస్తే, ఈ వారం ప్రారంభం నుండి కూడా గోల్డ్ మార్కెట్ డౌన్ ట్రెండ్ ఫాలో చేసింది. సోమవారం నుండి ఈరోజు వరకూ కూడా బంగారం ధర సూచీలు నెలకు చూశాయి. ఈ మూడు రోజుల్లో బంగారం ధర తులానికి దాదాపుగా 450 రూపాయలు పైగా క్రిందకు దిగింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.