Gold Price Down: గత 12 రోజులుగా ఆగకుండా పెరుగుతూ వస్తున్న గోల్డ్ మార్కెట్ కు ఈరోజు బ్రేకులు పడ్డాయి. గడిచిన 12 రోజుల్లో బంగారం ధర దాదాపుగా 3 వేలకు పైగా పెరిగింది. అయితే, ఈరోజు నష్టాలను చూసిన గోల్డ్ మార్కెట్ 65 వేల మార్క్ వద్దకు చేరుకుంది. మరి ఈరోజు దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దామా.
గడిచిన 12 రోజులుగా నాన్ స్టాప్ గా గోల్డ్ మార్కెట్ లాభాలను చూస్తూనే వచ్చింది. అంతేకాదు, నిన్నటి వరకు బంగారం ధర 66 వేల మార్కు పైనే కొనసాగింది. అయితే, ఈరోజు తులానికి రూ. 420 రూపాయల నష్టాన్ని చూసిన గోల్డ్ మార్కెట్ ఎట్టకేలకి 65 వేల మార్కుకి చేరుకుంది.
మార్చి 1వ తేదీ రూ. 63,160 రూపాయల వద్ద ప్రారంభమైన బంగారం ధర గడిచిన 12 రోజుల్లో రూ. 3,100 రూపాయలు పెరిగి రూ. 66,260 వద్దకు చేరుకుంది. అయితే, చివరి రెండు రోజులు స్థిరంగా నిలిచిన బంగారం ధర, ఈరోజు మాత్రం స్వల్పంగా క్రిందకు దిగి రూ. 65,840 వద్దకు చేరుకుంది.
Also Read: OnePlus Nord CE4: కంప్లీట్ స్పెక్స్ మరియు ఫీచర్లు తెలుసుకోండి.!
ఇక ఈరోజు మార్కెట్లో కొనసాగుతున్న లైవ్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 65,840 వద్ద కొనసాగుతోంది.
అలాగే, ఈరోజు కొనసాగుతున్న 22 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే, 10 గ్రామల 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 60,350 రూపాయల వద్ద క్లోజింగ్ నమోదు చేసింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్లో కొనసాగే గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.