ఈరోజు క్రిందకు దిగిన పసిడి ధర…ఎంతంటే.!

ఈరోజు క్రిందకు దిగిన పసిడి ధర…ఎంతంటే.!
HIGHLIGHTS

పసిడి ధర ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది

రెండు రోజుల్లో రూ.1,700 పైగా పెరుగిన పసిడి

ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ చూడండి

గత రెండు రోజులు కూడా భారీగా పెరిగిన పసిడి ధర, ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది. అయితే, ఇది గోల్డ్ రేట్ లో పెద్ద మార్పులేమీ కలిగించ లేదు. ఈ వారంలో బంగారం ధర మొదటి రోజు అనగా సోమవారం తులానికి 330 రూపాయలు తగ్గితే, మంగళ మరియు బుధవారం రెండు రోజుల్లో దాదాపుగా 1,700 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసింది. అయితే, ఈరోజు తులానికి 380 రూపాయలకు పైగా బంగారం ధర తగ్గింది. మొత్తంగా, ఈ వారం బంగారం ధర 60,000 మార్క్ పైనే కొనసాగుతోంది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉన్నదో చూద్దామా. 

Gold Price:

ఈరోజు ప్రధాన మార్కెట్ లో రూ.56,250 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.350 రూపాయలు క్రిందకు దిగి రూ.55,900 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, రూ.61,360 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు రూ.60,980 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, ఈరోజు బంగారం ధర రూ.380 రూపాయల తరుగుదలను చూసింది.

ఈరోజు బంగారం ధర

తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలో ఈరోజు బంగారం ధర చూస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,980 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో కూడా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,980 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.61,130 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,640 గా ఉంది.

సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్స్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి. అలాగే, మార్కెట్ రేట్ లో కూడా మార్పు ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo