ఈరోజు పడిపోయిన బంగారం ధర .. ఈరోజు తులం రేటు ఎంతంటే.!

Updated on 03-Aug-2022
HIGHLIGHTS

ఈరోజు బంగారం ధర పడిపోయింది

ఈరోజు మార్కెట్లో బంగారం ధర తులానికి 210 రూపాయల పతనాన్ని చూసింది

నిన్న పెరిగిన బంగారం ధర ఈరోజు తగ్గింది

నిన్న బంగారం మార్కెట్ కొంచెం పెరుగుదలను చూడగా, ఈరోజు మాత్రం బంగారం ధర పడిపోయింది. గత వారం రోజుల గోల్డ్ మార్కెట్ ని పరిశీలిస్తే, 51,490 రూపాయల వద్ద ప్రారంభమైన 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ఈరోజు 51,440 రూపాయల వద్ద కొనసాగుతోంది. అంటే, పూర్తి వారాన్ని లెక్కిస్తే బంగారం ధర దాదాపుగా స్థిరంగా కొనసాగుతోందని చెప్పవచ్చు. అయితే, నిన్నటితో పోలిస్తే ఈరోజు మార్కెట్లో బంగారం ధర తులానికి 210 రూపాయల పతనాన్ని చూసింది.  ఈరోజు దేశవ్యాప్తంగా గోల్డ్ మార్కెట్ ఎలా ఉన్నదో పరిశీలిద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,350 రూపాయలుగా ఉండగా, ఈరోజు 200 రూపాయలు తగ్గి 47,150 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు తులానికి 210 రూపాయలు తగ్గి రూ.51,440 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,150 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,440 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,020 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,390 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :