రోజు రోజుకు దారుణంగా పడిపోతున్న బంగారం ధర.!

Updated on 02-Sep-2022
HIGHLIGHTS

నిన్న మార్కెట్లో తులానికి 500 రూపాయలకు పైగా పతనమైన గోల్డ్ రేట్

ఈరోజు కూడా బంగారం రేటు నిన్నటి ట్రెండ్ నే ఫాలో అవుతూ వచ్చింది

ఒక్కవారం లోపలే దాదాపుగా తులానికి 1,400 రూపాయలకు పైగా బంగారం ధర పతనమయ్యింది

ఈరోజు కూడా బంగారం రేటు నిన్నటి ట్రెండ్ నే ఫాలో అవుతూ వచ్చింది. నిన్న మార్కెట్లో తులానికి 500 రూపాయలకు పైగా పతనమైన గోల్డ్ రేట్, ఈరోజు కూడా మరింతగా పడిపోయింది. ఇక గత శుక్రవారం నుండి ఈ శుక్రవారం వరకూ గోల్డ్ మార్కెట్ ట్రేడింగ్ ను పరిశీలించినట్లయితే, ఒక్కవారం లోపలే దాదాపుగా తులానికి 1,400 రూపాయలకు పైగా బంగారం ధర పతనమయ్యింది. ఈరోజు దేశ రాజధానితో సహా తెలుగు రాష్టాల ప్రధాన నగరాలలో బంగారం ధర ఎలా కొనసాగుతోందో తెలుసుకుందామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,500 రూపాయలుగా ఉండగా, ఈరోజు 46,400 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,610 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,610 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,610 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,610 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,950 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :