గోల్డ్ రేట్ డౌన్: తగ్గుతున్న బంగారం ధర.!

Updated on 12-Jun-2023
HIGHLIGHTS

మార్కెట్ లో రోజు రోజుకు తగ్గుతున్న బంగారం ధర

Gold Rate గత రెండు నెలల కనిష్టం లోనే కొనసాగుతోంది

గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది

గోల్డ్ రేట్ డౌన్: మార్కెట్ లో రోజు రోజుకు తగ్గుతున్న బంగారం ధర. గత నెల హైఎస్ట్ రేటును తాకిన గోల్డ్ మార్కెట్, ఈ నెల మాత్రం గత రెండు నెలల కనిష్టం లోనే కొనసాగుతోంది. గత శుక్రవారం నాడు స్వల్పంగా పెరిగిన గోల్డ్ రేట్, గత మూడు రోజులుగా మళ్ళీ క్రిందకు దిగుతోంది. అందుకే, ఈరోజు కూడా గోల్డ్ రేట్ 60 వేల మార్క్ వద్దనే కొనసాగుతోంది. 

గోల్డ్ రేట్ డౌన్: ఈరోజు అప్డేట్ ఏమిటి?

ఈరోజు గోల్డ్ రేట్ రేట్ అప్డేట్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్ లో ఒక 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 60,450 రూపాయల వద్ద ముగిసింది మరియు  10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ. 55,400 వద్ద ముగిసినది. శని వారం ఆదివారం స్థిరంగా కొనసాగిన గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా క్రిందకు దిగింది. 

ఇక గత మూడు నెలల గోల్డ్ మార్కెట్ వివరాలను చూస్తే, మార్చి నెలలో అత్యల్ప ధరలను చూసిన గోల్డ్ మార్కెట్ మార్చి చివరి నాటికి 60 వేల మార్క్ ను టచ్ చేసింది. అక్కడి నుండి మొదలైన గోల్డ్ సూచీల పెరుగుదల మే 5న 62 వేల మార్క్ ను చూసింది. అయితే, తరువాత మెల్ల మెల్లగా క్రిందకు దిగి ప్రస్తుతం 60 వేల మార్క్ వద్ద కొనసాగుతోంది.

ఈరోజు తెలుగురాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల లోని ప్రధాన నగరాలలో 10 గ్రా 24K బంగారం ధర రూ. 60,450 వద్ద ఉండగా, 10 గ్రా 22K  బంగారం ధర రూ. 55,400 వద్ద ఉంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :