GOLD:ఈరోజు కూడా పడిపోయిన బంగారం ధర..!!

Updated on 29-Aug-2022
HIGHLIGHTS

ఈరోజు తెరుచుకున్న గోల్డ్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది

బంగారం కొనాలని చూస్తుం వారికి మాత్రం శుభతరుణమే

గత శుక్రవారం నుండి బంగారం ధర తగ్గుముఖం పట్టింది

రెండురోజుల విరామం తరువాత ఈరోజు తెరుచుకున్న గోల్డ్ మార్కెట్, ఈరోజు కూడా నష్టాల్లో ముగిసింది. అయితే, బంగారం కొనాలని చూస్తుం వారికి మాత్రం శుభతరుణమే అని చెప్పాలి. ఎందుకంటే, గత శుక్రవారం నుండి బంగారం ధర తగ్గుముఖం పట్టింది. అంటే, వారాంతం డౌన్ ఫాల్ అయినా బంగారం ధర ఈ వారం ప్రారంభ రోజైన ఈ రోజు కూడా డే బాటలో నడుస్తోంది. ఈరోజు దేశ రాజధానితో పాటుగా తెలుగు రాష్టాల ప్రధాన నగరాలో గోల్డ్ రేట్ ఏవిద్ధంగా ఉన్నదో పరిశీలిద్దామా.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 47,290 రూపాయలుగా ఉండగా, ఈరోజు 47,140 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.51,420 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,140 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,420 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,140 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,420 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,140 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,420 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,690 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,030 గా ఉంది.

ప్రతి రోజు Gold Live అప్డేట్స్ కోసం Click Here  

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :