నిలకడగా బంగార ధర.. ఈరోజు రేటు ఎంతంటే.!

నిలకడగా బంగార ధర.. ఈరోజు రేటు ఎంతంటే.!
HIGHLIGHTS

ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర నిలకడగా కనిపిస్తోంది

గత వారం నుండి బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది

బంగారం ధర ఈ నెల తగ్గుతూ వచ్చింది

ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధర నిలకడగా కనిపిస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఉన్న 51,300 రూపాయల నుండి బంగారం ధర తగ్గుతూ వచ్చింది. ఈనెలలో రెండు సంవత్సరాల కనిష్ఠాన్ని కూడా నమోదు చేసిందంటే, ఈ నెల బంగారం ధర ఎంత తగ్గిందో ఊహించుకోవచ్చు. గత వారం నుండి బంగారం ధర నిలకడగా కొనసాగుతోంది. మొత్తంగా, ఈ నెల బంగారం కొనుగోలు చేసే వారికి తగిన సమయంగా మారింది. అందుకే, ఈరోజు మార్కెట్లో బంగారం ధర ఏవిద్ధంగా కొనసాగుతుందో పరిశీలిద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45,950 రూపాయలుగా ఉండగా, ఈరోజు 150 రూపాయలు స్వల్పంగా తగ్గి 45,800 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.49,960 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,810 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,960 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,960 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,960 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo