మరింత తగ్గిన బంగారం ధర.. 50 వేలకు చేరువలో గోల్డ్.!

మరింత తగ్గిన బంగారం ధర.. 50 వేలకు చేరువలో గోల్డ్.!
HIGHLIGHTS

మార్కెట్లో బంగారం ధర మరింత క్రిందకు దిగజారింది

ఈరోజు మార్కెట్లో బంగారం ధర 50 వేల రూపాయల దరిదాపుల్లో చేరుకుంది

ఈరోజు మార్కెట్ పారంభమవుతూనే బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది

మార్కెట్లో బంగారం ధర మరింత క్రిందకు దిగజారింది. అంతేకాదు, ఈరోజు మార్కెట్లో బంగారం ధర 50 వేల రూపాయల దరిదాపుల్లో చేరుకుంది. అంటే, క్లియర్ గా చెప్పాలంటే, బంగారం కొనడానికి చూస్తున్న వారికి మంచి రోజులు అని చెప్పవచ్చు. ఈరోజు మార్కెట్ పారంభమవుతూనే బంగారం ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. నిన్న కూడా బంగారం క్రిందకు దిగజారడం మొదలుపెట్టింది. కాబట్టి, ఈరోజు దేశరాజధాని సహా తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలతో బంగారం ధర ఎలా ఉందో పరిశీలిద్దాం.

నిన్న10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,400 రూపాయలుగా ఉండగా, ఈరోజు కూడా  46,200 రూపాయలతో నిలకడగానే కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,400 వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు  హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,400 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,410 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,410 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,200 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,400 గా ఉంది. ఈరోజు కూడా    దేశంలోని అన్ని ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,050 గా ఉంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo