Gold Price: దీపావళి పండుగ తరువాత భారీగా పెరిగిన బంగారం ధర.!

Gold Price: దీపావళి పండుగ తరువాత భారీగా పెరిగిన బంగారం ధర.!
HIGHLIGHTS

దీపావళి పండుగ తరువాత బంగారం ధర భారీగా పెరిగింది

దీపావళి పండుగ సమయంలో కూడా క్రిందకు దిగిన గోల్డ్

గోల్డ్ రేట్ ఒక్క వారంలోనే 62 వేల మార్క్ ను క్రాస్ చేసింది

Gold Price: దీపావళి పండుగ తరువాత బంగారం ధర భారీగా పెరిగింది. దీపావళి పండుగ సమయంలో కూడా క్రిందకు దిగిన గోల్డ్ మార్కెట్ ఇప్పుడు పెరుగుధలను నమోదు చేస్తోంది. నవంబర్ 13 వరకూ గోల్డ్ నష్టాలను చూస్తూ 60 వేలకు చేరుకుంది. అయితే, నవంబర్ 14 నుండి గోల్డ్ రేట్ రోజు రోజుకు పెరుగుతూ వచ్చింది. గోల్డ్ రేట్ ఒక్క వారంలోనే 62 వేల మార్క్ ను క్రాస్ చేసింది. ప్రస్తుతం 62 వేల మార్క్ ను దాటిన గోల్డ్ రేట్ లేటెస్ట్ అప్డేట్ ఏమిటో చూద్దామా.

Todays Gold Price

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఈరోజు బంగారం ధర రూ. 62,020 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Also Read : OpenAI: ChatGPT ప్రీమియం ఫీచర్ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది.!

గడిచిన 10 రోజుల గోల్డ్ రేట్ అప్డేట్

ఈరోజు మార్కెట్ లో గోల్డ్ స్థిరంగా ఉన్నా గడిచిన 10 రోజుల్లో మాత్రం భారీగా పెరుగుదలను చూసింది. ఇక గడిచిన 10 రోజుల గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే నవంబర్ 13 న గోల్డ్ రేట్ రూ. 60,490 రూపాయల వద్ద వుంది. అయితే, నవంబర్ 14 నుండి పెరగడం మొదలు పెట్టిన గోల్డ్ మార్కెట్ నవంబర్ 17 నాటికి రూ. 1,0000 రూపాయలకు పైగా పెరిగింది. నవంబర్ 17 తేదికి గోల్డ్ రేట్ రూ. 61,690 రూపాయల రేటును చేరుకుంది.

gold price today
గోల్డ్ రేట్ అప్డేట్

ఆ తరువాత కూడా గోల్డ్ మార్కెట్ భారీగా పెరుగుదలను నమోదు చేసింది. నవంబర్ 21న రూ. 380 రూపాయల పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, ప్రస్తుతం రూ. 62,020 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఈ పది రోజుల్లో గోల్డ్ మార్కెట్ 1,500 రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసినట్లు మనం గమనించవచ్చు.

గమనిక: ఆన్లైన్ గోల్డ్రేట్ మరియు లోకల్ మార్కెట్ లో గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo