Gold Price: ముందెన్నడూ చూడని రికార్డ్ రేటును టచ్ చేసిన గోల్డ్ రేట్.!
ముందెన్నడూ చూడని రికార్డ్ రేటును టచ్ చేసిన గోల్డ్ రేట్.
ఈరోజు కూడా భారీ పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్
గోల్డ్ మార్కెట్ ఆల్ టైం గరిష్ట రేటును నమోదు చేసింది
Gold Price: ముందెన్నడూ చూడని రికార్డ్ రేటును టచ్ చేసిన గోల్డ్ రేట్. ఈరోజు కూడా భారీ పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్ ఆల్ టైం గరిష్ట రేటును నమోదు చేసింది. ఈ నెలల్లో గోల్డ్ మార్కెట్ గతంలో ఎన్నడూ చూడని రేటును చూసింది. గత వారంతంలో ఒక్కసారిగా భారీగా పెరుగుదలను నమోదు చేసిన గోల్డ్ మార్కెట్, ఈ వారంలో కూడా అంతే దూకుడు మీదుంది. మరి ఈరోజు మరియు ఈవారం గోల్డ్ రేట్ అప్డేట్ ఎలా ఉన్నదో చూద్దామా.
Gold Price:
గత వారాంతంలో శనివారం నాడు ఒక్కరోజే తులానికి రూ. 1,310 రూపాయల పెరుగుదలను చూసిన గోల్డ్ రేట్ రూ. 71,290 రూపాయల కేలీజింగ్ ను నమోదు చేసింది. ఇక ఈ వారంలో 8వ తేదీ సోమవారం నాడు కూడా రూ. 330 రూపాయలు పెరిగిన బంగారం ధర రూ. 71,620 వద్ద క్లోజింగ్ ను సెట్ చేసింది.
ఇక ఈరోజు విషయానికి వస్తే, ఈరోజు ఉదయం రూ. 71,620 వద్ద మొదలైన ఒక తులం గోల్డ్ రేట్, ప్రస్తుతానికి రూ. 110 రూపాయలు పెరిగి రూ. 71,730 వద్ద కొనసాగుతోంది. అంటే, కేవలం గడిచిన నాలుగు రోజుల్లోనే గోల్డ్ మార్కెట్ రూ. 1,750 రూపాయల భారీ పెరుగుదలను నమోదు చేసింది.
Also Read: WhatsApp New: మీరు స్టేటస్ పెడితె చాలు ఇక అందరికి తెలిసిపోతుంది.!
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్
ఈరోజు కొనసాగుతున్న 24 క్యారెట్ గోల్డ్ రేట్ వివరాల్లోకి వెళితే, ఈరోజు రూ. 71,620 వద్ద ప్రారంభమైన గోల్డ్ రేట్, ప్రస్తుతం రూ. 71,730 వద్ద నడుస్తోంది. అంటే, ఈరోజు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 110 రూపాయల పెరుగుదలను నమోదు చేసింది.
ఈరోజు 24 క్యారెట్ గోల్డ్ రేట్
ఇక 22 క్యారెట్ గోల్డ్ రేట్ విషయానికి వస్తే, ఈరోజు రూ. 65,650 వద్ద మొదలైన గోల్డ్ రేట్, ప్రస్తుతం రూ. 65,750 వద్ద పయనిస్తోంది. అంటే, ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం రూ. 100 రూపాయలు పెరిగింది.
గమనిక: ఆన్లైన్ గోల్డ్ రేట్ మరియు లోకల్ మార్కెట్ గోల్డ్ రేట్ లలో మార్పులు ఉంటాయని గమనించాలి.